
హైదరాబాద్, మే 17: తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష (టీజీ ఈఏపీసెట్) 2026 ఫలితాలు ఆదివారం (మే 17) ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు చేతుల మీదగా ఫలితాలు వెల్లడించారు. ఈఏపీసెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు ఈ కింది టీవీ9 తెలుగు అధికారిక వెబ్‌సైట్ లింక్ ద్వారా ఫలితాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు. విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ పరీక్షల్లో భాగంగా మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు జరగగా, మే 9 నుండి 11 వరకు ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది మొత్తం మొత్తం 2,10,766 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,97,241 మంది విద్యార్థులు ఇంజనీరింగ్, 84,954 మంది అగ్రికల్చర్ విద్యార్ధులు పరీక్షలు రాశారు.
జేఎన్టీయూ నిపుణుల కమిటీ మల్టిపుల్ షిఫ్టుల మార్కులను నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా లెక్కించి పారదర్శకంగా ర్యాంకులను కేటాయించారు. ఫలితాలతో పాటు రెండు విభాగాలకు సంబంధించిన టాప్ 10 టాపర్స్ జాబితాను, ఉత్తీర్ణత శాతాన్నిఅధికారులు ప్రకటించారు.
ఈ రోజు విడుదలైన తెలంగాణ ఈఏపీసెట్ 2026 ఫలితాల్లో హైదరాబాద్ లోని ఉప్పల్ కి చెందిన M. రుషి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు.
ఈ ఏడాది మొత్తం 3,01,734 మంది ఈఏపీసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వీరికి 16 టెస్ట్ జోన్లలో 125 పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో మే 11 వరకు పరీక్షలు జరిగాయి. 93.52 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 84,954 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 2,10,766 మందికిగానూ 1,97,242 మంది పరీక్షకు హాజరయ్యారు.
టీజీ ఈఏపీసెట్ ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో 93.58 శాతం, అగ్రికల్చర్ విభాగంలో 93.38 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్ధులు టీవీ9 తెలుగు వెబ్ సైట్ లో తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ర్యాంకు కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఈఏపీసెట్ 2026 పరీక్షలు పూర్తయిన ఆరో రోజే ఫలితాలను విడుదల చేయడం వెనుక ఉన్నత విద్యాశాఖ ముందస్తు ప్రణాళికలే కారణం. ఈ ఏడాది జరిగిన ఆన్ లైన్ పరీక్షల్లో.. ఎగ్జాం ముగియగానే ప్రాథమిక కీ ఆధారంగా కంప్యూటర్ స్క్రీన్‌పై మార్కులు ప్రత్యక్షమయ్యేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఫలితాల ప్రక్రియను వేగంగా పూర్తి చేసింది. ఫలితాలను అధికారిక వెబ్ సైట్ తోపాటు టీవీ9 తెలుగు వెబ్ సైట్ లోనూ నేరుగా చెక్ చేసుకోండి.
ఈఏపీసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు ఆరు సెషన్లలో నిర్వహించిన పరీక్షకు మొత్తం 16 అభ్యంతరాలు విద్యార్ధులు వ్యక్తం చేయగా.. వీటన్నింటినీ నిపుణుల కమిటీ తోసిపుచ్చింది. దీంతో శుక్రవారం నిర్వహించిన సెట్ కమిటీ సమావేశంలో ఎప్‌సెట్ ఫైనల్ కీని ఖరారు చేశారు.
టీజీ ఈఏపీసెట్ 2026 అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం ప్రశ్న లు, సమాధానాలపై ఒక్క అభ్యంతరం కూడా రాకపోవడం గమనార్హం. విద్యార్ధులు తొలిసారి ఈ స్ట్రీమ్ లో ఆన్సర్ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.
పరీక్షలకు హాజరైన ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్కులు, నార్మలైజ్డ్ స్కోర్లు, ర్యాంక్‌లు కూడా నేడు అందుబాటులో ఉంచుతారు.
ఈఏపీసెట్‌ప్రవేశ పరీక్షలు మే 11వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే కేవలం 6 రోజుల వ్యవధిలోనే ఉన్నత విద్యామండలి వేగంగా ఫలితాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేసింది.
తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 ఫలితాల విడుదల కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు కంచెర్ల కేశవరావ్, ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగిత రాణా, TGCHE చైర్మన్ వి. బాలకిష్టా రెడ్డితోపాటు తదితరులు పాల్గొంటారు. టీజీ ఈఏపీసెట్ ర్యాంక్ కార్డులు ఉదయం 11.15 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు జరగగా, మే 9 నుండి 11 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు రాసిన 2 లక్షలకు పైగా విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ రోజు ఉదయం 11 గంటలకు జేఎన్టీయూ హైదరాబాద్ లోని గోల్డెన్ జూబ్లీ హాల్‍లో జరిగే కార్యక్రమంలో ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు చేతుల మీదగా ఫలితాలు విడుదల చేయనున్నారు.