Telangana EAMCET 2022: తెలంగాణ ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్య తేదీలివే..
తెలంగాణ ఎంసెట్-2022, ఈ-సెట్ నోటిఫికేషన్ విడదలైంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఎంసెట్-2022, ఈ సెట్-2022 నోటిఫికేషన్ తేదీలను విడుదల చేసింది.
తెలంగాణ ఎంసెట్-2022, ఈ-సెట్ నోటిఫికేషన్ విడదలైంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఎంసెట్-2022, ఈ సెట్-2022 నోటిఫికేషన్ తేదీలను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం… ఏప్రిల్ మాసం 6 నుంచి మే 28 వరకు ఆన్లైన్ దరఖాస్తులు జరుగనున్నాయి. ఎంసెట్ పరీక్షల దరఖాస్తు.. జనరల్ అభ్యర్థులకు ఫీజు రూ.800 గా పేర్కొంది విద్యాశాఖ. బీఈ, బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీకిగాను డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమెటిక్స్) విద్యార్థులకు ఈ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకు ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజు రూ.800. ఎస్సీ, ఎస్టీలకు రూ.400 ఉంది. ఎస్సీ, ఎస్టీలకు రూ.400 లను ఫిక్స్ చేసింది. జులై 14,15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ జరుగనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ స్పష్టం చేసింది. జులై 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ జరుగనున్నట్లు ప్రకటన చేసింది.
అటు ఈ సెట్ పరీక్షల నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. జులై 13 న ఎంట్రెన్స్ జరుగన్నట్లు స్పష్టం చేసింది తెలంగాణ విద్యాశాఖ. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఏప్రిల్ మాసం 6 నుండి జూన్ 8 వరకు ఆన్లైన్ దరఖాస్తులు జరుగనున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ విద్యాశాఖ.
ఈసీఈ, ఈఐఈ, సీఎస్‌ఈ, ఈఈఈ స్ట్రీమ్‌లకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఇక సీఐవీ, సీహెచ్‌ఈఎం, ఎంఈసీ, ఎంఐఎన్, ఎంఈటీ, పీహెచ్‌ఎం, బీఎస్‌ఎం విభాగాలకు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరపున జవహర్‌లాల్ నెహ్రు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(జేఎన్‌టీయూహెచ్) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్షను నిర్వహించడం జేఎన్‌టీయూహెచ్‌కి ఇది ఏడోసారి.
ఇవి కూడా చదవండి: Viral Video: మొసళ్ల గుంపుతో సింహం జంట భయంకరమైన యుద్దం.. షాకింగ్ వీడియో వైరల్..
Summer Skin Care: కేవలం 15 రోజుల్లో మెరిసిపోయే అందం మీ సొంతం.. జస్ట్ ఈ చిట్కాలు మీ కోసం..