AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG CPGET 2025 Counselling: టీజీ సీపీగెట్‌-2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. నేటి నుంచే రిజిస్ట్రేషన్లు

TG CPGET 2025 Counselling Schedule: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 యూనివర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షల (సీపీగెట్‌) ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. అభ్యర్థులు ర్యాంకు కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో..

TG CPGET 2025 Counselling: టీజీ సీపీగెట్‌-2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. నేటి నుంచే రిజిస్ట్రేషన్లు
Telangana CPGET 2025 Counselling Schedule
Srilakshmi C
|

Updated on: Sep 10, 2025 | 10:09 AM

Share

హైదరాబాద్, సెప్టెంబర్‌ 10: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 యూనివర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షల (సీపీగెట్‌) ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. అభ్యర్థులు ర్యాంకు కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 54,692 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. ఇక ఈ ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌)లో 93.83 శాతం మంది అర్హత సాధించారు. మొత్తం 44 సబ్జెక్టులకు గానూ గత నెలలో రాత పరీక్షలు నిర్వహించారు. వీరిలో 51,317 మంది ఉత్తీర్ణత సాధించారు. కన్వీనర్‌ కోటా కింద ఆయా పీజీ కోర్సుల్లో సీట్లు పొందేందుకు సెప్టెంబరు 10 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ వి బాలకిష్టారెడ్డి అన్నారు. మొత్తం 253 కాలేజీల్లో 41,709 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.

టీజీ సీపీగెట్‌-2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదీ…

  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు: సెప్టెంబర్‌ 10 నుంచి15 వరకు
  • వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ: సెప్టెంబర్‌ 18 నుంచి 20 వరకు
  • తొలి విడత సీట్ల కేటాయింపు తేదీ: సెప్టెంబర్‌ 24వ తేదీ
  • కళాశాలల్లో రిపోర్ట్‌ తేదీ: సెప్టెంబర్‌ 27వ తేదీలోపు
  • రెండో విడత ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు: సెప్టెంబర్‌ 29 నుంచి ప్రారంభం

ఏపీ పీజీ సెట్‌ 2025 కౌన్సెలింగ్‌ ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్‌ పీజీ సెట్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ సెప్టెంబరు 8 నుంచి ప్రారంభమైంది. మొత్తం రెండు విడతల్లో చేపట్టనున్న ఈ కౌన్సెలింగ్‌ తొలి విడత రిజిస్ట్రేషన్లు సెప్టెంబరు 15 వరకు జరుగుతాయి. ధ్రువపత్రాల పరిశీలనకు సెప్టెంబర్‌ 9 నుంచి16 వరకు, వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు సెప్టెంబర్‌ 12 నుంచి 17 వరకు అవకాశం ఇచ్చారు. వెబ్‌ ఐచ్ఛికాల్లో మార్పులు చేర్పులు సెప్టెంబర్‌ 18న చేసుకోవచ్చు. ఇక సెప్టెంబర్‌ 20న సీట్లు కేటాయిస్తారు. ఆయా కళాశాలల్లో సీట్లు పొందిన వారు 22 నుంచి 24 లోపు చేరాల్సి ఉంటుంది. అనంతరం రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
శరీరంలో వాపులు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతమా?
శరీరంలో వాపులు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతమా?
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వచ్చే 3 రోజులు వానలే వానలు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వచ్చే 3 రోజులు వానలే వానలు..
బెస్ట్ ఆప్షన్.. రూ.3 లక్షలు డిపాజిట్‌ చేస్తే.. కళ్లు చెదిరే లాభం
బెస్ట్ ఆప్షన్.. రూ.3 లక్షలు డిపాజిట్‌ చేస్తే.. కళ్లు చెదిరే లాభం
కేంద్ర దృష్టి యోగంతో ఈ రాశుల వారికి లగ్జరీ లైఫ్..!
కేంద్ర దృష్టి యోగంతో ఈ రాశుల వారికి లగ్జరీ లైఫ్..!
పైసా రిస్క్ లేదు.. ప్రాఫిట్ మాత్రమే.. నెలకు రూ.17 వేల ఆదాయం..
పైసా రిస్క్ లేదు.. ప్రాఫిట్ మాత్రమే.. నెలకు రూ.17 వేల ఆదాయం..
తలకిందులుగా వేలాడుతున్న ఈ టాలీవుడ్ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
తలకిందులుగా వేలాడుతున్న ఈ టాలీవుడ్ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
గురు బలం.. జూన్‌ నుంచి ఆ రాశులకు జాక్‌పాట్ ఖాయం..!
గురు బలం.. జూన్‌ నుంచి ఆ రాశులకు జాక్‌పాట్ ఖాయం..!
పాములను చంపితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష..! నమ్మరు కానీ.. ఇదే నిజం..
పాములను చంపితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష..! నమ్మరు కానీ.. ఇదే నిజం..
ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడంలేదా? ఐతే మీఆహారంలో వీటిని చేర్చండి
ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడంలేదా? ఐతే మీఆహారంలో వీటిని చేర్చండి
ఖాతాలో నామినీ లేకపోతే పిల్లలు డబ్బులను క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా?
ఖాతాలో నామినీ లేకపోతే పిల్లలు డబ్బులను క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా?