Telangana Intermediate Board: కరోనా మహమ్మారి కారణంగా విద్యా రంగం తీవ్రంగా ప్రభావితమైన విషయం తెలిసిందే. విపరీతంగా కేసులు పెరగడంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు విద్యా సంస్థలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక పరీక్షలను సైతం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి దీంతో మళ్లీ విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేశారు.
ఇప్పటికే ఇంటర్మీడియట్‌కు సంబంధించి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే 2021-2022 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి గడువు ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి చివరి తేదీని 30-09-2021 వరకు పొడగిస్తూ ప్రకటన విడుదల చేశారు.
ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, కోఆపరేటివ్, గురుకులాలు, కేజీబీవీ, ఇన్సెంటివ్ జూనియర్ కాలేజీలు, కాంపొజిట్ డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందొచ్చని సూచించారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల ప్రవేశాలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో అడ్మిషన్ల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.
Also Read: Bigg Boss 5 Telugu: ఆ ఒక్క మాటే కొంపముంచిందా ?.. ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..
RP Patnaik: సైదాబాద్ నిందితుడు రాజుని పట్టిస్తే క్యాష్ రివార్డు.. ఆర్పీ పట్నాయక్ ప్రకటన
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపుతున్న దళితబంధు.. ఎందుకు.. ఎలాగంటే?