Free Training: నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. ఉచిత నైపుణ్య శిక్షణతోపాటు జాబ్‌ కూడా!

|

Aug 11, 2024 | 7:04 AM

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు ఉద్యోగం కూడా పొందే సదావకాశం లభించింది. అయితే కేవలం బీసీ నిరుద్యోగ యువత మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సెప్టెంబరు 1 నుంచి నవంబరు 30 వరకు నాన్‌ రెసిడెన్షియల్‌ ఫ్రీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ కార్యక్రమంలో శిక్షణ పొందేందుకు నిరుద్యోగ బీజీ యువత నుంచి దరఖాస్తులు..

Free Training: నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. ఉచిత నైపుణ్య శిక్షణతోపాటు జాబ్‌ కూడా!
TG Free Skill Training
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 11: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు ఉద్యోగం కూడా పొందే సదావకాశం లభించింది. అయితే కేవలం బీసీ నిరుద్యోగ యువత మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సెప్టెంబరు 1 నుంచి నవంబరు 30 వరకు నాన్‌ రెసిడెన్షియల్‌ ఫ్రీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ కార్యక్రమంలో శిక్షణ పొందేందుకు నిరుద్యోగ బీజీ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ డి శ్రీనివాస్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని కుషాయిగూడ ఎల్జీ హోప్‌ టెక్నికల్‌ స్కిల్‌ అకాడమీలో 90 రోజుల పాటు శిక్షణ అందిస్తామని తెలిపారు.

శిక్షణ అనంతరం అకాడమీ ద్వారానే అభ్యర్ధులకు ఉద్యోగాలు కూడా కల్పిస్తారని చెప్పారు. అలాగే శిక్షణ పొందే 3 నెలల కాలంలో నెలకు రూ.4 వేల చొప్పున స్టయిపెండ్‌ కూడా ఇస్తారని ఆయన తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆగస్టు 24వ తేదీ వరకు బీసీ స్టడీ సర్కిల్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అయితే దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. అకడమిక్‌ మెరిట్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇతర వివరాలు, సందేహాలకు 040-24071178 ఫోన్‌ నంబరు ద్వారా పనివేళల్లో సంప్రదించవచ్చని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ డి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.

తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ వెబ్‌సైట్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్‌ ట్రిపుల్ ఐటీ మూడో విడత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఆర్‌కే వ్యాలీ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు తొలి, రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ రెండు కౌన్సెలింగ్‌లలో మిగిలిపోయిన సీట్లను మూడో విడత కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. మూడో విడత కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సిన విద్యార్ధుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోని ట్రిపుల్ ఐటీల్లో మూడో విడత కౌన్సెలింగ్‌కు ఆగస్టు 12వ తేదీలోపు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే రెండో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు క్యాంపస్ మార్చుకునేందుకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మొదటి, రెండో విడతలో సీట్లు పొంది, రిపోర్టు చేయని అభ్యర్థులు ఆగస్టు 12వ తేదీ లోగా మూడో విడత కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ ట్రిపుల్ ఐటీ మూడో విడత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.