Ambedkar Overseas Vidya Nidhi: విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారా? ఈ కీలక సమాచారం మీకోసమే..

|

Aug 07, 2021 | 9:09 AM

Ambedkar Overseas Vidya Nidhi: తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి స్కాలర్‌షిప్‌ లకు..

Ambedkar Overseas Vidya Nidhi: విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారా? ఈ కీలక సమాచారం మీకోసమే..
Telangana Govt
Follow us on

Ambedkar Overseas Vidya Nidhi: తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి స్కాలర్‌షిప్‌ లకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును పెంచారు. జులై 20వ వరకు ఉన్న గడువును ఆగస్టు 30వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ క్రిస్టినా చోంగ్తు పేరిట ప్రకటన విడుదల చేశారు. అర్హతలు, ఆసక్తి కలిగిన విద్యార్థులు telanganaepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా, ఈ పథకం ద్వారా విదేశాల్లో చదవాలనుకునే ఎస్టీ విద్యార్థులకు రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాల్లో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ఒకటి. ఈ పథకం కింద అర్హులైన షెడ్యూల్డ్ తెగల విద్యార్ధులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోటానికి ప్రభుత్వం రూ.20 లక్షల వరకు ఆర్థిక సహయం అందిస్తోంది. అయితే, ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధి కుటుంబ సభ్యుల సంవత్సర ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉండాలి. అలాగే వయస్సు జూలై 1 నాటికి 35 ఏళ్లు లోపు వారై ఉండాలి. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా దేశాల్లోని యూనివర్సిటీల్లో పీజీ చేయాలనుకుంటున్న విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పధకం గురించి మరిన్ని వివరాల కోసం విద్యార్థులు telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

Also read:

Andhra Pradesh: ప్రమోషన్ ఇవ్వడం లేదు.. కారుణ్య మరణానికి అనుమతి ఇప్పించండి..

JDU in Uttar Pradesh: కీలక ప్రకటన చేసిన జేడీయూ చీఫ్.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సై అంటూ..

Bluetooth Earphone: దేశంలోనే తొలి కేసు.. యువకుడి ప్రాణాలు తీసిన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్.. ఎక్కడ జరిగిందంటే..