Telangana: విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్.. అందుకోసం రూ.4.23 కోట్లు మంజూరు!

తెలంగాణ ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఫిబ్రవరి 16 నుండి మార్చి 10 వరకు సాయంత్రం ఉచితంగా స్నాక్స్ అందించనుంది. ఏకాగ్రత, ఉత్సాహం పెంపొందించడానికి రూ. 4.23 కోట్లు మంజూరు చేసింది. మార్చి 14 నుండి జరిగే SSC పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడమే ఈ పథకం లక్ష్యం.

Telangana: విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్.. అందుకోసం రూ.4.23 కోట్లు మంజూరు!
Telangana 10th Class Snacks

Updated on: Jan 12, 2026 | 7:52 AM

స్కూల్‌ విద్యార్థుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో టెన్త్‌ క్లాస్ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు.. ప్రతి రోజూ సాయంత్రం ఉచితంగా స్నాక్స్‌ అందించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ప్రభుత్వం రూ. రూ. 4.23 కోట్ల నిధులును కూడా మంజూరు చేసింది. మార్చి 14వ తేదీ నుంచి రాష్ట్రంలో 10వ తరగతి అన్యువల్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఏకాగ్రత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

గవర్నమెంట్‌ స్కూళ్లలో పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ కోసం నిధులు మంజూరు చేస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10వ వరకు మొత్తం 19 రోజుల పాటు స్నాక్స్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. టెన్త్ క్లాన్ ఎగ్జామ్స్ నేపథ్యంలో ప్రతి స్కూల్‌లో సాయంత్రం స్పెషల్ క్లాస్‌లు నిర్వహిస్తారు. ఈ సమయంలో విద్యార్థులకు పౌష్టికమైన అల్ఫాహారం అందించడం వల్ల వారిలో ఏకాగ్రత మెరుగు పడుతుందని.. అలాగే వారిలో ఉత్సాహం కూడా పెరుగుతుందిని అధికారులు భావిస్తున్నారు.

టెన్త్‌ క్లాస్ ఎగ్జామ్ షెడ్యూల్

ఇక రాష్ట్రంలో మార్చి 14వ తేదీ నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఏప్రిల్ 16వ తేదీతో ఈ వార్షిక పరీక్షలు ముగుస్తాయి. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:50 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు సరైన సమయంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ప్రభుత్వం కూడా రవాణా సౌకర్యాలను మెరుగు పరుస్తోంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.