Tea Board Jobs 2022: బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! టీ బోర్డు ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

|

Jul 14, 2022 | 5:02 PM

భారత ప్రభుత్వానికి చెందిన వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనున్న కోల్‌కతాలోని టీ బోర్డు ఇండియా (Tea Board of India).. ఒప్పంద ప్రాతిపదికన సైంటిస్ట్‌ (Scientist Posts) పోస్టుల భర్తీకి..

Tea Board Jobs 2022: బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! టీ బోర్డు ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
Tea Board Of India
Follow us on

Tea Board Kolkata Scientist Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనున్న కోల్‌కతాలోని టీ బోర్డు ఇండియా (Tea Board of India).. ఒప్పంద ప్రాతిపదికన సైంటిస్ట్‌ (Scientist Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 6

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: సీనియర్‌ సైంటిస్ట్, జూనియర్‌ సైంటిస్ట్, ఫ్యాక్టరీ అసిస్టెంట్‌, ఫార్మ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.30,000ల నుంచి రూ.60,000 ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లోడిప్లొమా, బీఎస్సీ, బీటెక్‌, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్/ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: The Secretary, Tea Board of India, 14, B.T.M Sarani, Kolkata-700001.

ఈ మెయిల్‌: tbidrrecruitment@gmail.com

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 24, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.