UPSC eligibility criteria 2022: యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ 2021లో ఉత్తీర్ణులైన దివ్యాంగ అభ్యర్థులు తమ ప్రాధాన్యతల్లో పోలీసు సర్వీసులను కూడా ఎంచుకొనేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం (మార్చి 25) సంచలన నిర్ణయం వెలువరించింది. దీంతో ఐపీఎస్‌తో పాటు ఢిల్లీ, అండమాన్ నికోబార్ ఐలాండ్ పోలీస్ సర్వీసెస్ (DANIPS), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసెస్ (IRPFS)లను కూడా దివ్యాంగ అభ్యర్ధులు ఎంచుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేసింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను ఏప్రిల్ 1 లోపు యూపీఎస్సీ కార్యదర్శికి నేరుగా సమర్పించాలని జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ ఏఎస్ ఓకాల ధర్మాసనం సూచించింది. కాగా సివిల్స్‌లో పోలీసు సర్వీసులకు దివ్యాంగులను మినహాయిస్తూ కేంద్రం గతేడాది ఆగస్టులో ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ.. పలువురు దివ్యాంగ అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం స్పందన కోరుతూ, తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ 2021 మెయిన్స్ తర్వాత తదుపరి ఘట్టమైన ఇంటర్వ్యూ షెడ్యూల్ (మార్చి 22) కూడా ఇప్పటికే విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం.. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) ఏప్రిల్ 5 నుంచి మే 26 వరకు జరగనున్నాయి. కాగా మార్చి 21న విడుదలైన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2021 ఫలితాల ఆధారంగా ఇంటర్వ్యూలు ప్రారంభంకానున్నాయి. చివరి ఘట్టమైన వ్యక్తిత్వ పరీక్షల (ఇంటర్వ్యూలు)కు సంబంధించిన ప్రక్రియ పూర్తయితే మెయిన్స్, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ర్యాంకులు ప్రకటిస్తారు. వీటికి సంబంధించిన e-Summon Letters త్వరలో విడుదలకానున్నాయి. ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్ధులు తప్పనిసరిగా ఈ లెటర్‌ను తీసుకెళ్లవల్సి ఉంటుంది. లెటర్‌లో పొందుపర్చిన ఇంటర్వ్యూ తేదీ, సమయంలో మార్పుల కోసం అభ్యర్ధుల నుంచి ఎటువంటి అభ్యర్ధనలను స్వీకరించబడవని ఈ సందర్భంగా యూపీఎస్సీ తెలియజేసింది. తాజా నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి సమాచారం అధికారిక వెబ్‌సైట్ www.upsc.gov.in లేదా www.upsconline.in.లో చెక్ చేసుకోవచ్చు.
Also Read: