TG EdCET 2025 Apllication: గుడ్‌న్యూస్.. ఎడ్‌సెట్‌ దరఖాస్తుకు బీటెక్‌ విద్యార్థులకూ ఛాన్స్! వెంటనే అప్లై చేసుకోండి..

రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువులు దక్కించుకోవాలంటే ఇంటర్‌ తర్వాత డీఎడ్‌ ప్రవేశ పరీక్ష, డిగ్రీ తర్వాత బీఎడ్‌ పరీక్ష రాయాల్సిందే. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా అడ్మీషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మీకు తెలుసా.. బీటెక్‌ పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తాజాగా విద్యాశాఖ ప్రకటించింది..

TG EdCET 2025 Apllication: గుడ్‌న్యూస్.. ఎడ్‌సెట్‌ దరఖాస్తుకు బీటెక్‌ విద్యార్థులకూ ఛాన్స్! వెంటనే అప్లై చేసుకోండి..
TG EdCET 2025

Updated on: May 04, 2025 | 4:36 PM

హైదరాబాద్‌, మే 4: ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే వారు ఇంటర్‌ తర్వాత డీఎడ్‌ ప్రవేశ పరీక్ష, డిగ్రీ తర్వాత బీఎడ్‌ పరీక్ష రాస్తుంటారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా అడ్మీషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మీకు తెలుసా.. బీటెక్‌ పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చట. ఈ మేరకు విద్యాశాఖ వెల్లడించింది. ఇప్పటికే బీఎడ్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవగా.. తాజా నిర్ణయం మేరకు బీటెక్‌ పూర్తి చేసిన విద్యార్ధులు బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు మే 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఎడ్‌ సెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ఏవీవీఎస్‌ స్వామి ఓ ప్రకటనలో తెలిపారు.

ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలనుకునే ఇంజినీరింగ్‌ విద్యార్థుల కోసం బీఈడీ కోర్సు చేసే అవకాశం కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు బీఈడీ గణితం, ఫిజికల్‌ సైన్స్‌ మెథడాలజీకి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మరింత సమాచారం కోసం ఏపీ ఎడ్‌సెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో మే 5 నుంచి ఇంటర్‌ ప్రవేశాలు

తెలంగాణ రాష్ట్రంలోని 194 మోడల్‌ స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఇంగ్లిష్ మీడియంలో చేరేందుకు మే 5వ తేదీ నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మోడల్‌ స్కూళ్ల అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను ఈ నెల 26న వెబ్‌సైట్‌లో విడుదల చేస్తామన్నారు. మే 27 నుంచి 31వ తేదీ వరకు ఒరిజినల్‌ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని, జూన్‌ 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా  దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.