Polytechnic Entrance Exam 2021: తెలంగాణ పాలిటెక్నిక్ ప‌రీక్ష నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఇలా అప్లై చేసుకోండి..

TS Polytechnic Entrance Exam 2021: తెలంగాణ‌లో 2021-2022 విద్యా సంవ‌త్స‌రానికి గాను పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలీసెట్)కు నోటిఫికేష‌న్ జారీ చేశారు. హైద‌రాబాద్‌లోని...

Polytechnic Entrance Exam 2021: తెలంగాణ పాలిటెక్నిక్ ప‌రీక్ష నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఇలా అప్లై చేసుకోండి..
Ts Plycet

Updated on: May 24, 2021 | 2:32 PM

TS Polytechnic Entrance Exam 2021: తెలంగాణ‌లో 2021-2022 విద్యా సంవ‌త్స‌రానికి గాను పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలీసెట్)కు నోటిఫికేష‌న్ జారీ చేశారు. హైద‌రాబాద్‌లోని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ ఈ నోటిఫికేష‌న్‌ను సోమవారం విడుద‌ల చేసింది. పాలీసెట్ ద్వారా ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేసుకున్న అభ్య‌ర్థులు ఇంజ‌నీరింగ్‌/నాన్ ఇంజినీరిగ్ డిప్లొమా కోర్సుల‌కు ప్ర‌వేశాలు క‌ల్పిస్తారనే విష‌యం తెలిసిందే. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షలు ఫ‌లితాలు వ‌చ్చిన నేప‌థ్యంలో ఈ నోటిఫికేషన్‌ను విడుద‌ల చేశారు. పాలీసెట్ 2021-2020కు సంబంధించిన పూర్తి వివ‌రాలు..

* పాలీసెట్ ద్వారా రాష్ట్రంలోని పాలిటెక్నీక్ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో న‌డుస్తోన్న సెకండ్ ఫిప్ట్ పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీ, పీవీ న‌ర్సింహా రావు తెలంగాణ యూనివ‌ర్సిటీతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నీక్ కోర్సులు అందించే సంస్థ‌ల్లో సీట్ల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పాలీసెట్ ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే విద్యార్థులు ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆసక్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌రఖాస్తుల ప్ర‌క్రియను నేటి నుంచి (24-05-2021) ప్రారంభించారు.

* ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీగా (ఎలాంటి ఆస‌ల్య రుసుము లేకుండా) 11-06-2021ని నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Covid Vaccine: నియంత్రణలోకి వస్తున్న కరోనా.. వ్యాక్సినేషన్‌తో సత్ఫలితాలు.. తగ్గుతున్న పాజిటివ్ కేసులు..!

Football Player: ఇటుకల బట్టీలో రోజువారీ కార్మికురాలిగా పని చేస్తున్న ఫుట్ బాల్ క్రీడాకారిణికి రూ. లక్ష సాయం, ఉద్యోగం కూడా !

Corona Effect: కరోనా ఎఫెక్ట్‌తో భారీగా తగ్గిన కార్ల కొనుగోళ్లు.. పుంజుకోనున్న పాత కార్ల బిజినెస్‌