SBI Recruitment 2021: ఎస్‌బీఐలో ఫైర్ ఇంజనీర్ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ముగుస్తోంది.. అప్లై చేసుకున్నారా?

|

Jun 27, 2021 | 6:20 PM

SBI Recruitment 2021: భార‌తీయ బ్యాంకింగ్ దిగ్గ‌జం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఫైర్ ఇంజ‌నీర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 16 ఖాళీల‌ను...

SBI Recruitment 2021: ఎస్‌బీఐలో ఫైర్ ఇంజనీర్ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ముగుస్తోంది.. అప్లై చేసుకున్నారా?
Sbi Fire Engineer Posts
Follow us on

SBI Recruitment 2021: భార‌తీయ బ్యాంకింగ్ దిగ్గ‌జం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఫైర్ ఇంజ‌నీర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 16 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ రేప‌టితో ముగియ‌నున్న నేప‌థ్యంలో ఉద్యోగాల‌కు ఎలా అప్లై చేసుకోవాలి లాంటి పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా ఎస్‌బీఐకి చెందిన సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం.. ఇంజనీర్‌(ఫైర్‌)పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు.
* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. బీఈ (ఫైర్‌)లో ఉత్తీర్ణ‌త సాధించాలి. లేదా.. నేషనల్‌ ఫైర్‌ సర్వీస్‌ కాలేజీ నుంచి బీటెక్‌ లేదా బీఈ ఉత్తీర్ణ‌త పొంది ఉండాలి. ఫైర్‌ టెక్నాలజీ అండ్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ లేదా బీఈ పాస్‌ కావాలి.
* జూన్ 15న మొద‌లైన ప్రారంభ‌మైన ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ రేప‌టితో (28-06-2021) ముగియ‌నుంది.
* అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు ఫీజుగా రూ. 750గా నిర్ణ‌యించారు.

ఎలా అప్లై చేసుకోవాలంటే..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు.. https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్య‌ర్థులు ఈ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన త‌ర్వాత Latest Announcmentsని క్లిక్ చేయాలి.
* అనంత‌రం ఫైర్ మేనేజర్ జాబ్ నోటీస్‌లో Apply Online క్లిక్ చేయాలి.
* కొత్త పేజీ ఓపెన్ అయిన త‌ర్వాత‌.. అందులో Click for New Registration పైన క్లిక్ చేయాలి.
* అనంత‌రం.. పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ ఇతర వివరాలు నమోదు చేసి మొదట రిజిస్టర్ చేయాలి.
* అన్ని వివరాలు ఎంట‌ర్ చేసిన త‌ర్వాత పేమెంట్ చేయాలి. చిరవ‌రిగా భ‌విష్య‌త్తు అవస‌రాల దృష్ట్యా ద‌ర‌ఖాస్తు ఫామ్‌ను ప్రింట్ తీసుకోవాలి.

Also Read: TATA Memorial Centre: టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్‌లో ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా? రేపే చివ‌రి తేదీ..

IGNOU ADMISSION 2021: ఉర్దూలో మాస్టర్స్ కోర్సును ప్రారంభించిన ఇగ్నో..! దూరవిద్య కింద అందుబాటులోకి..

ICMR Recruitment 2021: ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌లో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..