SSC JE Recruitment 2022: ఇంజనీరింగ్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో భారీగా జూనియర్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..

భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌.. ఇంజినీరింగ్‌ చదివినవారి నుంచి గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ..

SSC JE Recruitment 2022: ఇంజనీరింగ్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో భారీగా జూనియర్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
Ssc Je Recruitment

Updated on: Aug 14, 2022 | 9:30 AM

SSC Junior Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌.. ఇంజినీరింగ్‌ చదివినవారి నుంచి గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్స్‌ బ్రాంచీల్లో డిప్లొమా లేదా తత్సమాన అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 32 యేళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించినవారికి నెలకు రూ.35,400ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్త కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 2, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/వికాలాంగులు/మహిళలు/ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

రాత పరీక్ష విధానం: రాత పరీక్ష పేపర్‌-1, పేపర్‌-2లుగా ఉంటుంది. పేపర్‌-1 ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో మొత్తం 200 మార్కులకు 200 ప్రశ్నలకు నిర్వహిస్తారు. 2 గంటల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. పేపర్‌-2 ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. దీనిలో మొత్తం 300 మార్కులకు రెండు గంటల సమయంలో పరీక్ష ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు ఇవే..

ఇవి కూడా చదవండి
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 2, 2022.
  • దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 3, 2022.
  • దరఖాస్తులో మార్పులు చేసుకోవడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 4, 2022.
  • రాత పరీక్ష తేదీ: నవంబర్, 2022

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.