SSC GD Constable 2022: గుడ్‌న్యూస్‌! స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 45,284కు పెరిగిన కానిస్టేబుల్ కొలువులు.. రేపే చివరి తేదీ!

|

Nov 29, 2022 | 8:54 AM

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్/రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టుల సంఖ్యను భారీగా పెంచింది. దాదాపు 20,915 పోస్టులను అదనంగా చేర్చింది..

SSC GD Constable 2022: గుడ్‌న్యూస్‌! స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 45,284కు పెరిగిన కానిస్టేబుల్ కొలువులు.. రేపే చివరి తేదీ!
SSC GD Constable 2022 Vacancies Increased
Follow us on

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్/రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టుల సంఖ్యను భారీగా పెంచింది. దాదాపు 20,915 పోస్టులను అదనంగా చేర్చింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 45,284కి చేరింది. తొలుత ఇచ్చిన నోటిఫికేషన్‌లో 24,369 పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఆ సంఖ్యను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్ఎస్బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లో రైఫిల్మ్యాన్ (జనరల్ డ్యూటీ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)లో సిపాయి పోస్టులను ఉమ్మడి రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. మరోవైపు ఇంత భారీ మొత్తంలో పోస్టులకు ప్రకటన రావడంతో నిరుద్యోగులు ప్రిపరేషన్‌ బిజీ అయ్యారు. ఇక ఈ ఉమ్మడి నియామక నోటిఫికేషన్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ రేపటి (నవంబరు 30, 2022)తో ముగుస్తుంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు.

పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, శారీరక దారుడ్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు. 2023 జనవరి 10 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.69,100 వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.