SSC Exam Calendar 2024: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఉద్యోగ నియామక పరీక్షల క్యాలెండర్‌-2024 విడుదల

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి 2024-25 విద్యాసంవత్సరానికి గానూ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాదిలో నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను ప్రకటించింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు నిర్వహించే గ్రేడ్‌-సి స్టెనోగ్రాఫర్‌, దిల్లీ పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, సీఏపీఎఫ్‌, జూనియర్‌ ఇంజినీర్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, హవల్దార్‌ (సీబీఐసీ, సీబీఎన్‌), కానిస్టేబుల్‌ (జీడీ) తదితర ఉద్యోగ..

SSC Exam Calendar 2024: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఉద్యోగ నియామక పరీక్షల క్యాలెండర్‌-2024 విడుదల
Staff Selection Commission

Updated on: Nov 07, 2023 | 9:31 PM

న్యూఢిల్లీ, నవంబర్‌ 7: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి 2024-25 విద్యాసంవత్సరానికి గానూ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాదిలో నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను ప్రకటించింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు నిర్వహించే గ్రేడ్‌-సి స్టెనోగ్రాఫర్‌, దిల్లీ పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, సీఏపీఎఫ్‌, జూనియర్‌ ఇంజినీర్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, హవల్దార్‌ (సీబీఐసీ, సీబీఎన్‌), కానిస్టేబుల్‌ (జీడీ) తదితర ఉద్యోగ నియామక పరీక్షల తేదీలు, ఉద్యోగ ప్రకటన వివరాలను వెల్లడించింది. పోస్టుల నోటిఫికేషన్‌ వివరాలతోపాటు, దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు, నిర్వహించే తేదీలను క్యాలెండర్‌లో పొందుపరిచింది. అప్పటి పరిస్థితులను బట్టి ఈ తేదీల్లో మార్పులు ఉండొచ్చు. పరీక్షల క్యాలెండర్‌ను ఈ కింది డాక్యుమెంట్‌లో చూడొచ్చు.

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఎగ్జామ్ క్యాలెండర్‌ 2024 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

క్యాట్-2023 అడ్మిట్‌ కార్డులు విడుదల

దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(క్యాట్‌) 2023 ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదు చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహించే క్యాట్‌ పరీక్ష నవంబర్‌ 26న జరగనుంది. క్యాట్‌ స్కోరు ఆధారంగా ఐఐఎంలలో మాత్రమే కాకుండా ఇతర ప్రఖ్యాత కాలేజీల్లో కూడా సీట్లను భర్తీ చేస్తాయి. దేశవ్యాప్తంగా మొత్తం 155 న‌గ‌రాల్లో క్యాట్‌ ప్రవేశ పరీక్ష జరగనుంది.

ఇవి కూడా చదవండి

ఆర్‌బీఐ అసిస్టెంట్ ప్రిలిమ్స్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)లో 450 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్షకు సంబంధించిన కాల్‌లెటర్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి కాల్‌లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆర్బీఐ ప్రిలిమినరీ రాత పరీక్ష నవంబర్‌ 18, 19 తేదీల్లో జరుగుతుంది. మెయిన్స్‌ పరీక్షను డిసెంబర్‌ 31వ తేదీన జరుగుతుంది. కాగా ఆర్బీఐలోని అసిస్టెంట్ ఉద్యోగాలకు ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తిస్తారు. నెలకు రూ.20,700 నుంచి రూ.55,700 జీతంగా చెల్లిస్తారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.