SSC Stenographer Jobs: చివరి అవకాశం! మరికొన్ని గంటల్లో ముగుస్తున్న ఎస్సెస్సీ స్టెనోగ్రాఫర్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ..

|

Sep 05, 2022 | 1:02 PM

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (Staff Selection Commission) వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న.. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి, గ్రేడ్‌-డి (Stenographer Grade C and D Posts)లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి..

SSC Stenographer Jobs: చివరి అవకాశం! మరికొన్ని గంటల్లో ముగుస్తున్న ఎస్సెస్సీ స్టెనోగ్రాఫర్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ..
Ssc
Follow us on

SSC Stenographer C & D Recruitment 2022: న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (Staff Selection Commission) స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి, గ్రేడ్‌-డి (Stenographer Grade C and D Posts)లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి రోజు. అధికారిక నోటిఫికేషన్‌లో మొత్తం పోస్టుల సంఖ్య వెల్లడించలేదు. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీల ఆధారంగా పోస్టుల సంఖ్య త్వరలో ప్రకటిస్తారు. ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా ఈ రోజు (సెప్టెంబర్‌ 5, 2022) ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా జనవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 యేళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.100లు దరఖాస్తు రుసుము చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్‌/వికలాంగులు/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష తేదీ నవంబర్‌లో నిర్వహిస్తారు.

రాత పరీక్ష విధానం:
మొత్తం 200 మార్కులకు గానూ 200 మల్టీఛాయిస్ ప్రశ్నలకు 2 గంటల సమయంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. జనరల్‌ ఇంటెలిజన్స్‌ అండ్‌ రీజనీంగ్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.