SSC GD Constable Exam 2021: నవంబర్‌ 16 నుంచి SSC GD కానిస్టేబుల్ పరీక్షలు.. హాల్‌టికెట్‌ ఇలా..

|

Nov 09, 2021 | 7:51 PM

SSC GD Constable Exam 2021: SSC GD కానిస్టేబుల్ పరీక్ష కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అడ్మిట్ కార్డ్‌ని జారీ చేసింది. నవంబర్‌ 16 నుంచి ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ పోస్టుల

SSC GD Constable Exam 2021: నవంబర్‌ 16 నుంచి SSC GD కానిస్టేబుల్ పరీక్షలు.. హాల్‌టికెట్‌ ఇలా..
Ssc Gd
Follow us on

SSC GD Constable Exam 2021: SSC GD కానిస్టేబుల్ పరీక్ష కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అడ్మిట్ కార్డ్‌ని జారీ చేసింది. నవంబర్‌ 16 నుంచి ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ పోస్టుల కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in సందర్శించి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ పరీక్షలను నవంబర్ 16, 2021 నుంచి డిసెంబర్‌15, 2021 వరకు వివిధ నగరాల్లో నిర్వహిస్తుంది. ఈ ఎగ్జామ్ ద్వారా అస్సాం రైఫిల్స్‌లోని CAPFలు, NIA, SSA, రైఫిల్‌మ్యాన్‌కి సంబంధించి మొత్తం 25,271 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారు.

ఖాళీల వివరాలు
ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 25, 271 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అందులో పురుష కానిస్టేబుల్ పోస్టులు 22,424, మహిళా కానిస్టేబుల్ పోస్టులు 2,847 ఉన్నాయి. బీఎస్‌ఎఫ్‌లో 7,545, సీఐఎస్‌ఎఫ్‌లో 8,464, ఎస్‌ఎస్‌బీలో 3,806, ఐటీబీపీలో1,431, ఏఆర్‌లో 3,785, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 240 ఖాళీలు ఉన్నాయి. CRPF, NIA లలో ఖాళీలు లేవు.

అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
2. ఆ తర్వాత అడ్మిట్ కార్డ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
3. అభ్యర్థించిన సమాచారాన్ని నింపి ఓకే చేయండి.
4. మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
5. మీరు దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్‌ తీసుకోవచ్చు.

ఎంపిక ఇలా ఉంటుంది
ముందుగా రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్) ఉంటుంది. విజయవంతమైన అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PST) కోసం పిలుస్తారు. రాత పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథ్స్, ఇంగ్లీష్/హిందీ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. మొత్తం నాలుగు విభాగాల నుంచి 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. పేపర్ వ్యవధి 90 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి నాలుగో మార్కు కోత విధిస్తారు.

ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది ఇందులో 100 ప్రశ్నలు అడుగుతారు. కానీ పరీక్ష కోసం 90 నిమిషాలు మాత్రమే ఇస్తారు. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది తప్పు సమాధానం ఇచ్చినందుకు 0.25 మార్కులు కోత విధిస్తారు. ఇందులో జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.

PF Clients: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. కనీస పెన్షన్ పెంచే అవకాశాలు..! ఎంతంటే..?

గర్భిణులకు హెచ్చరిక.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే బిడ్డకి చాలా ప్రమాదం..

Crime News: జార్ఖాండ్‌లో దారుణం.. 8 మంది పిల్లల తండ్రికి 8వ తరగతి చదివే బాలికతో వివాహం