SSC SI Physical Events: రేపట్నుంచి ఎస్సై కొలువులకు దేహదారుఢ్య పరీక్షలు.. వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులు

|

Oct 13, 2024 | 7:14 AM

కేంద్ర సాయుధ బలగాల్లో ఎస్‌ఐ పోస్టుల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకోనుంది. ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌)లో సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఇప్పటికే ఆన్‌లైన్‌ రాత పరీక్ష పూర్తి కాగా దేహ దారుఢ్య పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పీఈటీ, పీఎస్‌టీ నిర్వహణ తేదీలను..

SSC SI Physical Events: రేపట్నుంచి ఎస్సై కొలువులకు దేహదారుఢ్య పరీక్షలు.. వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులు
SSC SI Physical Events
Follow us on

ఢిల్లీ, అక్టోబర్‌ 13: కేంద్ర సాయుధ బలగాల్లో ఎస్‌ఐ పోస్టుల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకోనుంది. ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌)లో సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఇప్పటికే ఆన్‌లైన్‌ రాత పరీక్ష పూర్తి కాగా దేహ దారుఢ్య పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పీఈటీ, పీఎస్‌టీ నిర్వహణ తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన కేంద్రాల్లో పీఈటీ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ) అక్టోబర్‌ 14 నుంచి నవంబర్‌ 11 వరకు జరగనున్నాయి. ఇక ఇప్పటికే ఇందుకు సంబంధించిన హాల్‌ టికెట్లు కూడా విడుదలయ్యాయి. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఈ పరీక్ష ద్వారా ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన (సీఏపీఎఫ్‌) బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలోనూ 4,187 సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. శారీరక దారుఢ్య పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌లు పూర్తైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అనంతరం మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి.. రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సదరన్‌ రీజియన్‌ సబ్-ఇన్‌స్పెక్టర్ దేహదారుఢ్య పరీక్షల అడ్మిట్‌ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఎడ్‌సెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ సీట్ల కేటాయింపు పూర్తి

తెలంగాణ రాష్ట్రంలోని బీఈడీ సీట్ల భర్తీకి ఎడ్‌సెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ సీట్లను అక్టోబరు 10న కేటాయించిన సంగతి తెలిసిందే. కన్వీనర్‌ కోటా కింద 5,439 సీట్లలో 3,222 మందికి సీట్లు దక్కాయని ప్రవేశాల కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పి రమేష్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన వారు అక్టోబరు 14 నుంచి 17వ తేదీల మధ్యలో ట్యూషన్‌ ఫీజు చెల్లించి, ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో రిపోర్టు చేయాల్సి ఉంటుందని ఆయన సూచించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.