
హైదరాబాద్, అక్టోబర్ 20: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ (CHSLE 2025) టైర్ 1 ఆన్‌లైన్ రాత పరీక్షలు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నవంబర్ 12 నుంచి మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ అభ్యర్థులకు సౌకర్యాలను కల్పించే లక్ష్యంతో సెల్ఫ్ స్లాట్ ఎంపికను కమిషన్ తీసుకువచ్చింది. అంటే అభ్యర్ధులు తమ పరీక్ష నగరం, తేదీ, షిఫ్ట్‌ను ఎంచుకునే సదుపాయాన్ని పూర్తిగా వారికే కల్పించింది. ఈ సెల్ఫ్ స్లాట్ ఎంపికతో ఏ తేదీల్లో ఏ సమయంలో పరీక్ష రాయడానిక ఆసక్తి చూపుతారో అభ్యర్ధులే నిర్ణయించుకోవచ్చు. ఇందుకు తొలుత అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ అధికారిక పోర్టల్‌లో లాగిన్ అయి దరఖాస్తు సమయంలో సమర్పించిన 3 ఎంపికలలో పరీక్ష రాసే నగరం, తేదీ, నిర్దిష్ట షిఫ్ట్‌ను తమకు అనుగుణంగా ఎంచుకోవచ్చు.
ఈ అవకాశం అక్టోబర్ 22 నుంచి 28 వరకు కల్పిస్తున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) తన ప్రకటనలో తెలిపింది. పరీక్షలకు సరిగ్గా 10 రోజుల మందు సిటీ ఇంటిమేషన్ ష్లిప్‌లను, 4 రోజులు ముందుగా అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. కాగా దేశ వ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు మొదలైనవాటిలో దాదాపు 3131 లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) 2025 ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్మీడియట్ అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేస్తుంది.
ఎస్సెస్సీ సీహెచ్‌ఎస్‌ఎల్ సెల్ఫ్ స్లాట్ ఎంపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, బోధన ఫీజుల దరఖాస్తు గడువు డిసెంబరు 31 వరకు పొడిగించినట్లు ఎస్సీ సంక్షేమశాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 30,758 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వివిధ ప్రవేశ పరీక్షల (సెట్స్) ప్రవేశాల వివరాలను అప్‌లోడ్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో గడువును పొడిగించినట్లు వివరించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.