Southern Railway Jobs: రైల్వే పారామెడికల్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. 191 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Southern Railway: చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సదరన్‌ రైల్వే పారామెడికల్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ అయింది. మొత్తం ఖాళీగా ఉన్న మొత్తం..

Southern Railway Jobs: రైల్వే పారామెడికల్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. 191 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌
Southern Railway

Updated on: Apr 22, 2021 | 9:41 PM

Southern Railway: చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సదరన్‌ రైల్వే పారామెడికల్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ అయింది. మొత్తం ఖాళీగా ఉన్న మొత్తం 191 పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో నర్సింగ్ సూపరింటెండెంట్, ఫిజియోథెరపిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, హెమోడయాలిసిస్ టెక్నీషియన్, హాస్పిటల్ అసిస్టెంట్, హౌజ్ కీపింగ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2, రేడియోగ్రాఫర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2021 ఏప్రిల్ 30. ఎంపికైన పారామెడికల్ సిబ్బందికి చెన్నైలోని పెరంబూర్‌లో గల హెడ్‌క్వార్టర్స్ రైల్వే హాస్పిటల్‌లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అయితే ఇవి కంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://sr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు- 191
నర్సింగ్ సూపరింటెండెంట్- 83, ఫిజియోథెరపిస్ట్- 1, ఈసీజీ టెక్నీషియన్- 4, హెమోడయాలిసిస్ టెక్నీషియన్- 3, హాస్పిటల్ అసిస్టెంట్- 48, హౌజ్ కీపింగ్ అసిస్టెంట్- 40, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2- 9
రేడియోగ్రాఫర్- 3,

వేతనాలు ఇలా..

నర్సింగ్ సూపరింటెండెంట్- రూ.44,900 + డీఏ + ఇతర అలవెన్సులు
ఫిజియోథెరపిస్ట్- రూ.35,400 + డీఏ + ఇతర అలవెన్సులు
ఈసీజీ టెక్నీషియన్- రూ.25,500 + డీఏ + ఇతర అలవెన్సులు
హెమోడయాలిసిస్ టెక్నీషియన్- రూ.35,400 + డీఏ + ఇతర అలవెన్సులు
హాస్పిటల్ అసిస్టెంట్- రూ.18,000 + డీఏ + ఇతర అలవెన్సులు
హౌజ్ కీపింగ్ అసిస్టెంట్- రూ.18,000 + డీఏ + ఇతర అలవెన్సులు
ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2- రూ.21,700 + డీఏ + ఇతర అలవెన్సులు
రేడియోగ్రాఫర్- రూ.29,200 + డీఏ + ఇతర అలవెన్సులు

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 30
విద్యార్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

ఇవీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. ఎస్‌బీఐలో 86 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌… దరఖాస్తు గడువు మే 3 వరకు

BECIL Recruitment: నిరుద్యోగులకు శుభవార్త… బీఈసీఐఎల్‌లో 463 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. నేడు చివరి తేదీ