Singareni Jobs 2023: సింగరేణిలో 558 ఉద్యోగాలు.. వారంలో నోటిఫికేషన్‌ విడుదల..

సింగరేణిలో 558 ఉద్యోగాలకు ఫిబ్రవరి మొదటి వారంలోగా నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు డైరెక్టర్‌ ఎస్‌ చంద్రశేఖర్‌ సోమవారం (జనవరి 30) తెలిపారు..

Singareni Jobs 2023: సింగరేణిలో 558 ఉద్యోగాలు.. వారంలో నోటిఫికేషన్‌ విడుదల..
Singareni SCCL Recruitment 2023

Updated on: Jan 31, 2023 | 8:52 PM

సింగరేణిలో 558 ఉద్యోగాలకు ఫిబ్రవరి మొదటి వారంలోగా నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు డైరెక్టర్‌ ఎస్‌ చంద్రశేఖర్‌ సోమవారం (జనవరి 30) తెలిపారు. కొత్తగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. మొత్తం పోస్టుల్లో 277 ఉద్యోగాలు నిరుద్యోగుల ద్వారా భర్తీ చేస్తారు. అందుకు రాతపరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. మిగిలిన 281 పోస్టులను అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేస్తామని ఆయన తెలిపారు.

పోస్టుల వివరాలు..

అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేసే పోస్టుల వివరాలు..

  • అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఈ 2 గ్రేడ్‌-ఈ అండ్‌ ఎం) పోస్టులు: 30
  • జూనియర్‌ ఇంజినీర్‌ (ఈ 1 గ్రేడ్‌-ఈ అండ్‌ ఎం) పోస్టులు: 20
  • అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఈ 2 గ్రేడ్‌-సివిల్‌) పోస్టులు: 4
  • జూనియర్‌ ఇంజినీర్‌ (ఈ 1 గ్రేడ్‌-సివిల్‌) పోస్టులు: 4
  • వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ట్రైనీ (ఈ 1 గ్రేడ్‌) పోస్టులు: 11
  • ప్రోగ్రామర్‌ ట్రైనీ (ఈ 1 గ్రేడ్‌) పోస్టులు: 4
  • జూనియర్‌ కెమిస్ట్‌ లేదా జూనియర్‌ టెక్నికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు: 20
  • ఫిట్టర్‌ ట్రైనీ (కేటగిరీ-1) పోస్టులు: 114
  • ఎలక్ట్రీషియన్‌ ట్రైనీ (కేటగిరీ-1) పోస్టులు: 22
  • వెల్డర్‌ ట్రైనీ (కేటగిరీ-1) పోస్టులు: 43
  • శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ (కేటగిరీ-డి) పోస్టులు: 5

రాత పరీక్ష ద్వారా భర్తీ చేసే పోస్టుల వివరాలు..

  • జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్ పోస్టులు: 30
  • మేనేజ్‌మెంట్ ట్రైనీలు.. మైనింగ్‌ పోస్టులు: 79
  • ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ పోస్టులు: 66
  • సివిల్‌ పోస్టులు: 18
  • ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ పోస్టులు: 10
  • ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్ పోస్టులు: 18
  • ఐటీ పోస్టులు: 7
  • హైడ్రోజియాలజిస్ట్‌ పోస్టులు: 2
  • పర్సనల్‌ పోస్టులు: 22
  • జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు: 3
  • జూనియర్‌ ఎస్టేట్స్ ఆఫీసర్‌ పోస్టులు:10
  • సబ్‌ ఓవర్‌సీర్‌ ట్రైనీ (సివిల్‌) పోస్టులు: 16

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us