Secunderabad Army School Jobs: ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. వివిధ సబ్జెక్టుల్లో బోధన అనుభవం ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తుకోవచ్చు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ఉద్యోగాలను తీసుకోనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 21 పోస్టులను భర్తీచేయనున్నారు.
* నోటిఫికేషన్‌లో భాగంగా పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ)–06, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)–05, ప్రైమరీ టీచర్లు(పీఆర్‌టీ)–10 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
* సైకాలజీ, కామర్స్, జాగ్రఫీ, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్‌లలో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) టీచర్లను తీసుకోనున్నారు. అభ్యర్థులు కనీసం 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ చేసి ఉండాలి. సీబీఎస్‌ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు బోధించిన అనుభవం ఉండాలి.
* ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ చేసి ఉండాలి. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరోతరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు బోధించిన అనుభవం ఉండాలి.
* ప్రైమరీ టీచర్స్(పీఆర్‌టీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ/డీఈడీ చేసి ఉండాలి.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును ఆర్‌కే పురం ఫ్లైఓవర్, సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తులకు చివరి తేదీగా 10-06-2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Bat in Plane: అమెరికా వెళుతున్న విమానంలో గబ్బిలం..తిరిగి ఢిల్లీ చేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్!