Army Public School Jobs: సికింద్రాబాద్‌లోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

| Edited By: Ravi Kiran

May 26, 2022 | 1:14 PM

Army Public School Jobs: సికింద్రాబాద్‌లోని ఆర్కేపురంలో ఉన్న ఆర్మీ పబ్లిక్‌ స్కూల్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఈ స్కూల్లో టీచింగ్ పోస్టులను...

Army Public School Jobs: సికింద్రాబాద్‌లోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
Follow us on

Army Public School Jobs: సికింద్రాబాద్‌లోని ఆర్కేపురంలో ఉన్న ఆర్మీ పబ్లిక్‌ స్కూల్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఈ స్కూల్లో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 45 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ) – 07, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీ) – 20 , ప్రైమరీ టీచర్లు (పీఆర్‌టీ) – 15, ప్రైమరీ టీచర్లు (పీఆర్‌టీ) – 03 ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఆయా సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌/ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు టీచింగ్ అనుభవం తప్పనిసరి.

* అభ్యర్థుల వయసు 01.06.2022 నాటికి 40 ఏళ్లు మించకుండా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను సీబీఎస్‌ఈ/ ఏడబ్ల్యూఈఎస్‌ నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 06-06-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..