Secunderabad Army Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ.. పూర్తి వివరాలు..!

|

Nov 27, 2021 | 11:47 AM

Secunderabad Army Recruitment: ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగ అవకాశాలు వెలువడుతున్నాయి. తాజాగా ఆ..

Secunderabad Army Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ.. పూర్తి వివరాలు..!
Follow us on

Secunderabad Army Recruitment: ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగ అవకాశాలు వెలువడుతున్నాయి. తాజాగా ఆర్మీలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ వెలువడింది. తెలంగాణలో ఆర్మీ ఉద్యోగాల కోసం ర్యాలీ నిర్వహించనున్నారు.
సికింద్రాబాద్‌ యూనిట్‌ పరిధిలోని కోటాలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు కేంద్ర రక్షణ శాఖ వెల్లడించింది. ఇందులో సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ, సోల్జర్‌ ట్రెడ్స్‌మ్యాన్‌, టెక్నికల్‌ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ర్యాలీ నవంబర్‌ 29 నుంచి జనవరి, 2022 వరకు జరుగనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి పాస్‌ అయితే చాలు. వయసు17-21 ఏళ్ల మధ్య ఉండాల్సి ఉంటుంది.

ఇక టెక్నికల్‌ పోస్టులకు ఇంటర్మీడియేట్‌ పాస్‌ కావాల్సి ఉంటుంది. మొత్తం 50 శాతం మార్కులతో పాస్‌ కావాల్సి ఉంటుంది. అలాగే ట్రేడర్స్‌మెన్‌ ఉద్యోగాలకు పదో తరగతి పాస్‌ కావాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయసు 17-23 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే సోల్జర్‌ ఏఓసీ వార్డ్‌ కేటగిరిలో దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియేట్‌ పాస్‌ కావాల్సి ఉంటుంది. కనీసం సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులు ఉండటం తప్పనిసరి. మొత్తంగా 60 శాతం మార్కులతో ఇంటర్మీడియేట్‌ పాస్‌ కావాల్సి ఉంటుంది. దరకాస్తు చేసుకునే అభ్యర్థులు 17-23 ఏళ్ల మధ్య ఉండాలి.

అలాగే క్రీడారంగంలో రాణించిన వారు ఔట్‌స్టాండింగ్‌ ఓపెన్‌ విభాగంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రం, లేదా దేశం తరపున జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో, సీనియర్‌, జూనియర్‌ లెవెల్‌లో పాల్గొని ఉండాలి. అయితే భారత ఆర్మీ సూచించిన తేదీల్లో అభ్యర్థులు ర్యాలీకి వెళ్లడం తప్పనిసరి అని ఇండియన్‌ ఆర్మీ తెలిపింది. సికింద్రాబాద్‌ తిరుమలగిరి, ఈస్ట్‌ మారేడ్‌పల్లిలోని హెడ్‌క్వార్టర్స్‌ ఏఓసీ సెంటర్‌లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు.. airawat0804@nic.in లేదా www.joinindianarmy@nic.in కు సంప్రదించవచ్చు. అయితే కరోనా మహమ్మారి ఉన్నందున తేదీల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. అభ్యర్థులు ఈ విషయాలను గమనిస్తుండటం మంచిది.

ఇవి కూడా చదవండి:

TS Inter Results: విద్యార్థులూ బీ అలర్ట్.. డిసెంబర్ మొదటి వారంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు..!

HAL Recruitment: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ బెంగళూరులో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..