SECR Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్! సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1033 అప్రెంటిస్ ఉద్యోగాలు..
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన బిలాస్‌పూర్ (చత్తీస్‌గఢ్) ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR)రాయ్‌పూర్ డివిజన్‌లోని వివిధ విభాగల్లో.. అప్రెసంటిస్ పోస్టుల (Apprentice Vacancies) భర్తీకి..
SECR Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన బిలాస్‌పూర్ (చత్తీస్‌గఢ్) ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR)రాయ్‌పూర్ డివిజన్‌లోని వివిధ విభాగల్లో.. అప్రెసంటిస్ పోస్టుల (Apprentice Vacancies) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టులు: 1033
పోస్టులు: అప్రెంటిస్ ఖాళీలు
ఖాళీల వివరాలు:
- డీఆర్‌ఎం ఆఫీసర్, రాయ్‌పూర్ డివిజన్: 696
- బేగన్ రిపేర్ షాప్, రాయ్‌పూర్: 337
ట్రేడులు: వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, హెల్త్ అండ్ శానిటరీ ఇన్‌స్పెక్టర్, మెషినిస్ట్, మెకానిక్ డీజిల్, మెకానికల్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ చేసి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ.100
- ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 24, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: