Scientist Posts: హైదరాబాద్‌ సీసీఎంబీలో శాస్త్రవేత్తల ఉద్యోగాలు..దరఖాస్తుకు చివరి తేదీ.. పూర్తి వివరాలు..!

| Edited By: Phani CH

Oct 03, 2021 | 8:27 AM

Scientist Posts: సెంట‌ర్ ఫ‌ర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బ‌యోలజీ (సీసీఎంబీ) హైద‌రాబాద్‌లో సైంటిస్ట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా..

Scientist Posts: హైదరాబాద్‌ సీసీఎంబీలో శాస్త్రవేత్తల ఉద్యోగాలు..దరఖాస్తుకు చివరి తేదీ.. పూర్తి వివరాలు..!
Follow us on

Scientist Posts: సెంట‌ర్ ఫ‌ర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బ‌యోలజీ (సీసీఎంబీ) హైద‌రాబాద్‌లో సైంటిస్ట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా సైంటిస్ట్‌, సీనియ‌ర్ సైంటిస్ట్‌, సీనియ‌ర్ ప్రిన్సిప‌ల్ సైంటిస్ట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు ప్రక్రియ సెప్టెంబ‌ర్ 20, 2021 నుంచి ప్రారంభమై అక్టోబ‌ర్ 11, 2021 వ‌రకు కొన‌సాగుతుంది. అభ్యర్థుల సౌక‌ర్యం కోసం ద‌ర‌ఖాస్తు ఫీజు కేవ‌లం రూ.100 మాత్రమే నిర్ణయించింది. ద‌ర‌ఖాస్తు చేసుకోనే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల‌కు వ‌యోప‌రిమితి స‌డ‌లింపు ఉండ‌నుంది. వేతనం రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ద‌ర‌ఖాస్తు ప్రక్రియ‌, అర్హత‌ల వివ‌రాలు.

సైంటిస్ట్: లైఫ్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. రీసెర్చ్ రంగంలో అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి 32 ఏళ్లు మించి ఉండకూడదు.

సీనియర్ సైంటిస్ట్: లైఫ్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి. వయోపరిమితి 37 ఏళ్లు మించి ఉండకూడదు.

సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్: లైఫ్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. ఆరేళ్ల పని అనుభవం ఉండాలి. వయోపరిమితి 50 ఏళ్లు మించి ఉండకూడదు.

ఎంపిక విధానం..

ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల‌లో కొంద‌రిని షార్ట్ లిస్ట్‌ను తయారు చేస్తారు. అభ్యర్థుల అనుభవం, అకాడ‌మిక్ సామార్థ్యాల బట్టి షార్ట్‌ లిస్ట్‌ ఉంటుంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల‌కు ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం.

అభ్యర్థులు ముందుగా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అధికారి వెబ్‌సైట్ ను సంద‌ర్శించాలి.

అనంత‌రం నోటిఫికేష‌న్‌లో వివ‌రాలు చదివి అందులో అర్హత ఉన్న పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనేంద‌కు పేజీ కింద Click for apply online ఆప్షన్ క్లిక్ చేయాలి. అనంత‌రం ద‌ర‌ఖాస్తు ఫాం నింపాలి. నింపిన ద‌ర‌ఖాస్తును ప్రింట్ తీసుకొని అవ‌స‌ర‌మైన ధ్రువ‌ప‌త్రాల‌ను జ‌త చేసి కింది అడ్రస్‌కు పంపాలి.

దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అక్టోబర్‌ 11, 2021. అయితే హార్డ్ కాపీ పోస్టు చేరేందుకు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 19, 2021.

Section Officer
(Recruitment), CSIR-Centre for Cellular and Molecular Biology,
Uppal Road,
Habsiguda,
Hyderabad – 500007,
Telangana