TG Model Schools Admissions 2026: మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్.. షెడ్యూల్‌ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్‌ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ తాజాగా విడుదలైంది. షెడ్యూల్‌ ప్రకారం జనవరి 28 నుంచి మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. ఫిబ్రవరి 28, 2026వ తేదీ వరకు..

TG Model Schools Admissions 2026: మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్.. షెడ్యూల్‌ ఇదే
Telangana Model Schools Entrance Examination 2026

Updated on: Jan 17, 2026 | 8:09 AM

హైదరాబాద్‌, జనవరి 17: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్‌ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ తాజాగా విడుదలైంది. షెడ్యూల్‌ ప్రకారం జనవరి 28 నుంచి మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. ఫిబ్రవరి 28, 2026వ తేదీ వరకు ప్రవేశ పరీక్షలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు కొనసాగుతాయి. ఇక ఏప్రిల్‌ 19న రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. కాగా ఆరో తరగతిలో ప్రవేశాలతోపాటు 7వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ స్కూళ్లలో మిగిలి పోయిన సీట్ల భర్తీకి కూడా ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఈ సీట్ల కోసం కూడా బాలికలు, బాలురు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింది డైరెక్ట్ లింక్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

తెలంగాణ మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ 2026 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

రేపట్నుంచే ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌ 2 పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల లింక్‌ ఇదే

స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ (ఎస్సెస్సీ) కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2025 టైర్‌ 2 పరీక్షల అడ్మిట్‌ కార్డులు విడుదల అయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్‌ అవ్వడం అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక రాత పరీక్షలు జనవరి 18, 19 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. జనవరి 18న స్కిల్‌ టెస్ట్ ఉంటుంది. జనవరి 19న మాథ్యమెటికల్‌ ఎబిటిటీ అండ్‌ రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటలిజెన్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రెహెన్షన్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌, స్టాటిస్టిక్స్‌ పేపర్‌ (సెక్షన్‌ 1, 2, 3)కు పరీక్ష జరుగుతుంది. మొత్తం 1,30,418 మంది అభ్యర్ధులు టైర్‌ 2 పరీక్షకు అర్హత సాధించారు. కాగా 2025 జూన్ నెలలో స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ (SSC) సీజీఎల్‌ 14,582 గ్రూప్‌ ‘బి’, గ్రూప్‌ ‘సి’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలింసిందే.

ఇవి కూడా చదవండి

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌ 2 పరీక్ష అడ్మిట్ కార్డుల 2026 కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.