AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI CBO Job Notification 2025: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే?

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు..

SBI CBO Job Notification 2025: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే?
SBI CBO Job Notification
Srilakshmi C
|

Updated on: May 09, 2025 | 3:12 PM

Share

దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద దేశ వ్యాప్తంగా 2,964 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తన ప్రకటనలో తెలిపింది. ఇందులో సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్ పోస్టులు 2600, బ్యాక్‌ లాంగ్‌ పోస్టులు 364 వరకు ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌లో 233, అమరావతిలో 186 వరకు ఖాళీలు ఉన్నాయి. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మే 9 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

రాష్ట్రాల వారీగా ఖాళీల ఇవే..

  • అహ్మదాబాద్‌లో పోస్టుల సంఖ్య: 240
  • ఆంధ్రప్రదేశ్‌లో పోస్టుల సంఖ్య: 180
  • కర్ణాటకలో పోస్టుల సంఖ్య: 250
  • మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్లో పోస్టుల సంఖ్య: 200
  • ఒడిశాలో పోస్టుల సంఖ్య: 100
  • హరియాణాలో పోస్టుల సంఖ్య: 306
  • జమ్ము & కశ్మీర్, లడఖ్‌, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్‌లో పోస్టుల సంఖ్య: 80
  • తమిళనాడు, పుదుచ్చేరిలో పోస్టుల సంఖ్య: 120
  • నార్త్‌ ఈస్ట్రన్‌లో పోస్టుల సంఖ్య: 100
  • తెలంగాణలో పోస్టుల సంఖ్య: 230
  • రాజస్తాన్‌లో పోస్టుల సంఖ్య: 200
  • కోల్‌కతాలో పోస్టుల సంఖ్య: 150
  • లక్నోలో పోస్టుల సంఖ్య: 280
  • మహారాష్ట్రలో పోస్టుల సంఖ్య: 250
  • ముంబయి మెట్రో(మహారాష్ట్ర, గోవా)లో పోస్టుల సంఖ్య: 100
  • న్యూఢిల్లీలో పోస్టుల సంఖ్య: 30
  • తిరువనంతపురంలో పోస్టుల సంఖ్య: 90

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఏప్రిల్ 3, 2025 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే అభ్యర్ధులు మే 01,1995 నుంచి ఏప్రిల్ 30, 2004 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు పదేళ్ల వరకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన మే 29, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.750 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, స్థానిక భాష పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆన్‌లైన్‌ పరీక్ష జులై 2025లో జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.48,480 వరకు జీతంగా చెల్లిస్తారు.

రాత పరీక్ష విధానం..

ప్రిలిమినరీ పరీక్ష మొత్తం నాలుగు విభాగాల్లో 120 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలకు 30 మార్కులకు, బ్యాంకింగ్‌ నాలెడ్జ్‌లో 40 ప్రశ్నలకు 40 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌, ఎకానమీ విభాగంలో 30 ప్రశ్నలు 30 మార్కులు, కంప్యూటర్‌ యాప్టిట్యూడ్‌లో 20 ప్రశ్నలు 20 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 2 గంటలపాటు ఉంటుంది. నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.