SBI Jobs: ఫ్రెషర్లకు పండగలాంటి వార్త.. ప్రభుత్వ బ్యాంకులో 12వేల ఉద్యోగాలు..

|

May 12, 2024 | 8:01 PM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 వేల మంది ఫ్రెషర్లను నియించుకోనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ విషయాన్ని ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా తెలిపారు. 85 శాతం మంది ఇంజనీర్‌ గ్రాడ్యుయేట్లకే అవకాశం కల్పించనున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా 3 వేల మంది పీఓలు, 8 వేల మంది అసోసియేట్లకు బ్యాంకింగ్‌ వ్యవహారాల్లో శిక్షణ ఇచ్చి ఆపై వివిధ...

SBI Jobs: ఫ్రెషర్లకు పండగలాంటి వార్త.. ప్రభుత్వ బ్యాంకులో 12వేల ఉద్యోగాలు..
Sbi Jobs
Follow us on

ఓవైపు ఉద్యోగాలు పోతున్నాయి. ఆర్ధిక మాంద్యం వెంటాడుతోంది. దాదాపు అన్ని ప్రముఖ ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. ఇక ఫ్రెషర్లను సైతం కంపెనీలు నియమించుకోవడం మానేశాయి. అయితే ఇలాంటి తరుణంలో ప్రముఖ దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ గుడ్ న్యూస్‌ చెప్పింది. ఫ్రెషర్లకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 వేల మంది ఫ్రెషర్లను నియించుకోనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ విషయాన్ని ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా తెలిపారు. 85 శాతం మంది ఇంజనీర్‌ గ్రాడ్యుయేట్లకే అవకాశం కల్పించనున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా 3 వేల మంది పీఓలు, 8 వేల మంది అసోసియేట్లకు బ్యాంకింగ్‌ వ్యవహారాల్లో శిక్షణ ఇచ్చి ఆపై వివిధ వ్యాపార విభాగాల్లో నియమించుకోనున్నట్లు చెప్పారు.

ఇక ప్రస్తుతం బ్యాంకింగ్‌ రంగంలో కూడా సాంకేతికత వినియోగం పెరిగిందని, దీనికి అనుగుణంగా ఖాతాదారులకు టెక్నాలజీతో కూడిన సేవలను అందించడంపై దృష్టిసారించిల్సన అవసరం ఉందని అన్నారు. కొన్ని బ్యాంకులు టెక్నాలజీని అందుకోవడంలో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఫ్రెషర్లను నియమించుకొని వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి, వారి ప్రతిభను ఆధారంగా ఉద్యోగ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో బ్యాంకింగ్ సెక్టార్‌కు తగిన స్థాయిలో టెక్‌ మ్యాన్‌ పవర్ అందించడం సాధ్యమవుతుందన్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఎస్‌బీఐ సిబ్బందికి ఇన్‌హౌన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ ఇస్తున్నామని తెలిపిన దినేశ్‌ ఖారా.. ప్రస్తుతం ఉద్యోగులందరూ టెక్నాలజీ అందిపుచ్చుకోవాల్సి అవసరం ఉందన్నారు. ఈ విషయమై ఇప్పటికే ఆర్‌బీఐ నుంచి కూడా మార్గదర్శకాలు ఉన్నాయని, మరోవైపు సాంకేతిక అంశాలపై ఆర్‌బీఐ ఇప్పటికే దృష్టి సారించింది. ఈ విషయంలో ఏదైనా బ్యాంక్‌లో లోపాలు గుర్తిస్తే పెద్ద ఎత్తున జరిమానా విధిస్తోంది.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..