APSS Recruitment 2023: సమగ్ర శిక్షా సొసైటీ పరిధిలోని భవిత కేంద్రాల్లో 396 ఐఈఆర్‌ఎస్‌ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

|

Sep 10, 2023 | 5:24 PM

ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖకు చెందిన సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని భవిత కేంద్రాల్లో తాత్కాలిక/ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న సహిత విద్యా రిసోర్స్‌ పర్సన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ వెలువడింది. 2023-24 విద్యాసంవత్సరానికి గానూ ఏడాది పాటు పనిచేసేందుకు ఈ నోటిఫికేషన్‌..

APSS Recruitment 2023: సమగ్ర శిక్షా సొసైటీ పరిధిలోని భవిత కేంద్రాల్లో 396 ఐఈఆర్‌ఎస్‌ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
Samagra Shiksha Abhiyan
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖకు చెందిన సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని భవిత కేంద్రాల్లో తాత్కాలిక/ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న సహిత విద్యా రిసోర్స్‌ పర్సన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ వెలువడింది. 2023-24 విద్యాసంవత్సరానికి గానూ ఏడాది పాటు పనిచేసేందుకు ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 396 పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు అర్హతలుగా.. ఇంటర్‌, ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ/స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈడీతో పాటు డిప్లొమా (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) లేదా బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) లేదా డీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌), పీజీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎలాంటి రాత పరీక్షలేకుండా పని అనుభవం, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్‌లో 10 మార్కుల వెయిటేజీ, డిగ్రీకి 30 మార్కులు, అనుభవంకి 5 మార్కుల వెయిటేజీ ఉంటుంది. పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీకి 35 మార్కుల వెయిటేజీ ఉంటుంది. మొత్తం 85 మార్కులకు వెయిటేజీ, 15 మార్కులకు స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.

వయోపరిమితి..

జులై 31, 2023వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు 47 ఏళ్ల వరకు, వికలాంగ అభ్యర్ధులకు 52 ఏళ్ల వరకు వయసు ఉండాలి.సెప్టెంబర్‌ 18వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలిపించారు. అప్లికేషన్‌ ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.100 చెల్లించాలి.

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు..

  • అనంతపురం పోస్టుల సంఖ్య: 42
  • చిత్తూరు పోస్టుల సంఖ్య: 36
  • ఈస్ట్ గోదావరి పోస్టుల సంఖ్య: 46
  • గుంటూరు పోస్టుల సంఖ్య: 33
  • కడప పోస్టుల సంఖ్య: 32
  • కృష్ణా పోస్టుల సంఖ్య: 42
  • కర్నూలు పోస్టుల సంఖ్య: 13
  • ప్రకాశం పోస్టుల సంఖ్య: 25
  • నెల్లూరు పోస్టుల సంఖ్య: 31
  • శ్రీకాకుళం పోస్టుల సంఖ్య: 18
  • విశాఖపట్నం పోస్టుల సంఖ్య: 37
  • విజయవాడ పోస్టుల సంఖ్య: 14
  • వెస్ట్ గోదావరి పోస్టుల సంఖ్య: 31

అధికారిక నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.