SAIL Rourkela Jobs2022: నెలకు రూ.లక్షకు పైగా జీతంతో సెయిల్ రూర్కెలాలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారానే!

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL Rourkela)కు చెందిన ఒరిశాలోని రూర్కెలా స్టీల్ ప్లాంట్.. ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ డాక్టర్‌, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ (Specialist Doctor Nurse) పోస్టుల భర్తీకి..

SAIL Rourkela Jobs2022: నెలకు రూ.లక్షకు పైగా జీతంతో సెయిల్ రూర్కెలాలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారానే!
Sail Rourkela

Updated on: Mar 31, 2022 | 9:06 AM

SAIL Rourkela Specialist Doctor Recruitment 2022: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL Rourkela)కు చెందిన ఒరిశాలోని రూర్కెలా స్టీల్ ప్లాంట్.. ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ డాక్టర్‌, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ (Specialist Doctor Nurse) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 9

పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‌ డాక్టర్‌, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

పే స్కేల్‌: నెలకు రూ.90,000 నుంచి రూ.1,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్‌ పీజీ డిగ్రీ/డిప్లొమా (ఎండీ/డీఎన్‌బీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

అడ్రస్: న్యూ కాన్ఫరెన్స్‌ హాల్‌, ఇస్పాత్ జనరల్‌ హాస్పిటల్‌, సెక్టర్‌-19, ఒడిశా-769005.

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

TS SA2 exams 202: హవ్వ..! ఇదెక్కడి చోద్యం.. కేవలం వారం రోజుల ముందు వార్షిక పరీక్షల టైం టేబుల్‌ విడుదల!