భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన భిలాయ్ లోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. 259 సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్/సీనియర్ మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. హైడ్రాలిక్స్ మెయింటనెన్స్, జనరల్ మెడిసిన్, సైకియాట్రీ, ఈఎన్‌టీ, ఎలక్ట్రికల్, కెమికల్, మెకానికల్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా/ఐటీఐ/బీఈ/బీటెక్/ఎంబీబీఎస్/డీఎం/డీఎన్‌బీ/ఎంసీహెచ్/పీజీ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 28 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 17, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 26వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.500, పారామెడికల్ స్టాఫ్ పోస్టులకు రూ.250 అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈఎస్ఎమ్ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.25,070ల నుంచి రూ.2.4 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.