RRC Railway Jobs 2025: పదో తరగతి అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

ఎస్‌ఈఆర్‌) పరిధిలోని అన్ని డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ కోల్‌కతాలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద 1,785 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు..

RRC Railway Jobs 2025: పదో తరగతి అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
RRC South Eastern Railway job

Updated on: Nov 19, 2025 | 6:41 AM

సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే (ఎస్‌ఈఆర్‌) పరిధిలోని అన్ని డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ కోల్‌కతాలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద 1,785 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 17, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతిలో వచ్చిన మార్కులతోపాటు ఐటీఐ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

ఖరగ్‌పూర్ వర్క్‌షాప్, సిగ్నల్ అండ్‌ టెలికాం (వర్క్‌షాప్)(ఖరగ్‌పూర్), ట్రాక్ మెషిన్ వర్క్‌షాప్ (ఖరగ్‌పూర్), ఎస్‌ఎస్‌ఈ (వర్క్స్), ఇంజినీరింగ్ (ఖరగ్‌పూర్), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో (ఖరగ్‌పూర్), డీజిల్ లోకో షెడ్ (ఖరగ్‌పూర్), సీనియర్‌ డీఈఈ (జి) (ఖరగ్‌పూర్), టీఆర్‌డీ డిపో/ ఎలక్ట్రికల్ (ఖరగ్‌పూర్), ఈఎంయూ షెడ్/ ఎలక్ట్రికల్ (టీపీకేఆర్‌), ఎలక్ట్రిక్ లోకో షెడ్ (సంత్రగచి), సీనియర్‌ డీఈఈ (జి)(చక్రధర్‌పూర్), ఎలక్ట్రిక్ ట్రాక్షన్ డిపో(చక్రధర్‌పూర్), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో(చక్రధరపూర్), ఎలక్ట్రిక్ లోకో షెడ్(టాటా), ఇంజినీరింగ్ వర్క్‌షాప్ (సిని), ట్రాక్ మెషిన్ వర్క్‌షాప్(సిని), ఎస్‌ఎస్‌ఈ(వర్క్స్)/ ఇంజినీరింగ్ (చక్రధర్‌పూర్), ఎలక్ట్రిక్ లోకో షెడ్(బండాముండా), డీజిల్ లోకో షెడ్(బండాముండా), సీనియర్‌ డీఈఈ (జి)(ఆద్రా), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో(ఆద్రా), డీజిల్ లోకో షెడ్(బీకేఎస్‌సీ), టీఆర్‌డీ డిపో/ఎలక్ట్రికల్(ఆద్రా), ఎలక్ట్రిక్ లోకో షెడ్(బీకేఎస్‌సీ), ఎలక్ట్రిక్ లోకో షెడ్(ఆర్‌వోయూ), ఎస్‌ఎస్‌ఈ(వర్క్స్)/ ఇంజినీరింగ్ (ఆద్రా), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో (రాంచీ), సీనియర్‌ డీఈఈ (జి)(రాంచీ), టీఆర్‌డీ డిపో/ ఎలక్ట్రికల్(రాంచీ), ఎస్‌ఎస్‌ఈ (వర్క్స్)/ ఇంజినీరింగ్ (రాంచీ).. ఆర్‌ఆర్‌సీ డివిజన్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతితో పాటు ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్, ఎంఎంటీఎం, ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్, రిఫ్రిజిరేటర్ అండ్‌ ఏసీ మెకానిక్, లైన్‌మ్యాన్, తదితర ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు డిసెంబర్‌ 12, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఎలాంటి రాత పరీక్ష లేకుండాన మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నిబంధనల మేరకు ప్రతి నెలా స్టూపెండ్ చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.