Railway Sports Quota Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలు నోటిఫికేషన్‌ విడుదల

నార్త్‌ సెంట్రల్ రైల్వే పరిధిలో స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌ (RRC) నోటిఫికేషన్‌ జారీ చేసింది. పదో తరగతిలో అర్హత కలిగిన స్పోర్ట్స్‌ అభ్యర్ధులకు ఈ నోటిఫికేషన్‌ కింద రైల్వే గ్రూప్‌ డి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే అభ్యర్ధులు తప్పనిసరిగా నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత క్రీడాంశాల్లో అర్హత కలిగి ఉండాలి..

Railway Sports Quota Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలు నోటిఫికేషన్‌ విడుదల
Railway Sports Quota Jobs

Updated on: Feb 08, 2025 | 12:35 PM

నార్త్‌ సెంట్రల్ రైల్వే పరిధిలో స్పోర్ట్స్‌ కోటాలో ఖాళీగా ఉన్న గ్రూప్‌ డి పోస్టులకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌ (RRC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 38 స్పోర్ట్స్‌ కోటా గ్రూప్‌ డి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సంబంధిత క్రీడాంశాల్లో అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 3, 2025వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. స్పోర్ట్స్‌లో అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్‌ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 9, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 9, 2025వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. దరఖాస్తు రుసుము కింద జనరల్/ఈడబ్ల్యూఎస్‌,/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.250 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌లో లింక్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆర్‌ఆర్‌సీ స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ డి పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.