RRC Railway Jobs 2025: పదో తరగతి అర్హతతో రైల్వేలో 4,116 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక

Northern Railway Apprentice Recruitment 2025 Notification: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ క్లస్టర్‌లలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నార్తర్న్‌ రైల్వే (RRC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 4,116 అప్రెంటీస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అభ్యర్ధులు ఎవరైనా..

RRC Railway Jobs 2025: పదో తరగతి అర్హతతో రైల్వేలో 4,116 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక
Northern Railway Apprentice Recruitment Notification

Updated on: Nov 20, 2025 | 9:21 AM

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ క్లస్టర్‌లలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నార్తర్న్‌ రైల్వే (RRC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 4,116 అప్రెంటీస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అభ్యర్ధులు ఎవరైనా నవంబర్ 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

క్లస్టర్‌ వారిగా అప్రెంటిస్‌ ఖాళీల వివరాలు ఇలా..

  • లక్నోలో పోస్టుల సంఖ్య: 1,397
  • ఢిల్లీలో పోస్టుల సంఖ్య: 1,137
  • ఫిరోజ్‌పుర్‌లో పోస్టుల సంఖ్య: 632
  • అంబాలలో పోస్టుల సంఖ్య: 934
  • మొరదాబాద్‌లో పోస్టుల సంఖ్య: 16

ఈ పోస్టులను ట్రేడ్‌, మెడిసిన్‌, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, కార్పెంటర్‌ వంటి మొదలైన ట్రేడుల్లో భర్తీ చేస్తారు. పోస్టులను అనుసరించి పదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐలో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి 2025 డిసెంబర్‌ 24వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్ 24, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.100 చొప్పున చెల్లిచంవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు స్టైపెండ్‌ కూడా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు.

నార్తర్న్‌ రైల్వేలో అప్రెంటిస్‌ ఖాళీల నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.