భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (అండర్ గ్రాడ్యుయేట్)లకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో మొత్తం 3,445 కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులను సికింద్రాబాద్‌తో సభా అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పుర్, జమ్ము శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం రీజియన్లలో భర్తీ చేస్తారు. ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్‌లో 89 వరకు పోస్టులు ఉన్నాయి.
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి లేదా ఇంటర్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్/ హిందీలో టైపింగ్ ప్రావీణ్యం ఉండాలి. అభ్యర్ధుల వయసు జనవరి 1, 2025 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 21, 2024వ తేదీ నుంచి ప్రారంభమైంది. అక్టోబర్ 20, 2024వ తేదీతో ముగుస్తుంది. దరఖాస్తు సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.250 వరకు చెల్లించాలి. దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ అక్టోబర్ 22, 2024. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (టైర్-1, టైర్-2), స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులకు రూ.21,700, ఇతర పోస్టులకు రూ.19,900 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఫస్ట్ స్టేజ్ రాత పరీక్ష ఆన్‌లైన్ విధానంలో మొత్తం 100 మార్కులకు 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 90 నిమిషాల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. స్టేజ్ 2 పరీక్ష కూడా ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతుంది.