RRB NTPC Result 2021: RRB NTPC పరీక్ష రాసిన అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ NTPC CBT 1 పరీక్ష ఫలితాల తేదీని ప్రకటించింది. దీనికి సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అలహాబాద్ అధికారిక వెబ్‌సైట్ rrbald.gov.in లో నోటీసు జారీ చేసింది. RRB NTPC ఫలితం 2021 తో పాటు CBT 2 పరీక్ష తేదీ కూడా ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, పరీక్ష తేదీలు మారే అవకాశం ఉంది. RRB (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్) జారీ చేసిన నోటీసు ప్రకారం.. రైల్వే నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ అంటే NTPC CBT 1 పరీక్ష ఫలితాలు 15 జనవరి 2022 రోజున ప్రకటిస్తారని తెలిపింది. మీరు మీ ఫలితాలను ఇలా తెలుసుకోండి.
RRB NTPC CBT 1 ఫలితం 2021 డిక్లరేషన్ తర్వాత మీరు మీ సంబంధిత RRB ప్రాంతీయ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఉదాహరణకు RRB అలహాబాద్ కోసం rrbald.gov.in ఆ వెబ్‌సైట్ హోమ్ పేజీలో మీరు RRB NTPC ఫలితం 2021 (CBT 1) లింక్‌ని పొందుతారు. దానిపై క్లిక్ చేయండి. PDF ఫార్మాట్‌లో ఫలితం మీ మొబైల్ / కంప్యూటర్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ రోల్ నంబర్లు ఇస్తారు.
RRB NTPC CTB 2 పరీక్ష ఎప్పుడు?
CBT 1 పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులు RRB NTPC CBT 2 పరీక్షకు హాజరవుతారు. ఈ పరీక్ష 14 ఫిబ్రవరి నుంచి 18 ఫిబ్రవరి 2022 వరకు నిర్వహిస్తారు. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా అప్పటి వరకు ఉన్న పరిస్థితి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తేదీలను మార్చవచ్చు. మీరు మరిన్ని వివరాలకు RRB వెబ్‌సైట్‌ని పరిశీలిస్తూ ఉండండి. NTPC CBT 1 పరీక్షను RRB 28 డిసెంబర్ 2020 నుంచి 31 జూలై 2021 వరకు మొత్తం 7 వేర్వేరు దశల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే.