
హైదరాబాద్, నవంబర్ 19: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవల జారీ చేసిన జూనియర్ ఇంజనీర్ పోస్టుల సంఖ్య ఇటీవల భారీగా పెంచుతూ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 2,588కి చేరింది. జూనియర్ ఇంజినీర్, డిపొ మెటీరియల్ సూపరిటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి జమ్మూ-శ్రీనగర్, చెన్నై రిజియన్ల పరిధిలోని ఖాళీలను పెంచినట్లు ఆర్‌ఆర్‌బీ తన ప్రకటనలో తెలిపింది. అలాగే ఆన్‌లైన్ దరఖాస్తు గడువును కూడా ఏకంగా 10 రోజులపాటు పొడిగించినట్లు ఆర్‌ఆర్‌బీ ప్రకటన జారీ చేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారు ఎంచుకున్న ఆర్ఆర్‌బీ, పోస్టు ప్రాధాన్యత, రైల్వే జోన్/ప్రొడక్షన్ యూనిట్ ప్రాధాన్యతలను ఎటువంటి రుసుము చెల్లించకుండా సవరించుకోవచ్చు. ఈ సదుపాయం నవంబర్ 25 నుంచి అందుబాటులోకి వస్తుంది. దరఖాస్తు చివరి తేదీ వరకు సవరణకు అవకాశం కల్పించనుంది.
ఆర్‌ఆర్‌బీ అక్టోబర్‌లో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2,569 భర్తీ చేస్తున్నట్లు తన ప్రకటనలో తెలిపింది. ఇందులో చెన్నై రీజియన్‌లో 160 ఉండగా వాటిని 169కు, జమ్మూ-శ్రీనగర్ రీజియన్‌లో 88 ఉండగా.. వాటిని 95 ఖాళీలను పెంచింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 2,588కు పెరిగింది. అలాగే నవంబర్ 30తో దరఖాస్తు ముగియనుండగా దానిని డిసెంబర్ 10 వరకు పొడిగించింది. దరఖాస్తు ఫీజు చెల్లింపులు డిసెంబర్ 12వ తేదీ వరకు అవకాశం కల్పించింది. అప్లికేషన్ సవరణకు డిసెంబర్ 13 నుంచి 22 అవకాశం కల్పించింది. ఇతర వివరాలు ఈ కింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఆర్‌ఆర్‌బీ జేఈ నియామకాలకు సంబంధించిన ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.