RRB Exam Dates 2025: ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి రాత పరీక్షల కొత్త తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

RRB Group D 2025 city intimation slip download Link: ఇండియన్‌ రైల్వే పరిధిలో గ్రూప్‌-డి ఉద్యోగాల భర్తీకి నిర్వహించవల్సిన నియామక పరీక్షవాయిదా పడిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు వాయిదా పడిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనే దాని గురించ చెబుతూ ప్రకటన..

RRB Exam Dates 2025: ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి రాత పరీక్షల కొత్త తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
RRB Group D 2025 New Exam Dates

Updated on: Nov 19, 2025 | 7:02 AM

హైదరాబాద్‌, నవంబర్‌ 19: ఇండియన్‌ రైల్వే పరిధిలో గ్రూప్‌-డి ఉద్యోగాల భర్తీకి నిర్వహించవల్సిన నియామక పరీక్షవాయిదా పడిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు వాయిదా పడిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనే దాని గురించ చెబుతూ ప్రకటన వెలువరించింది. ఇందులో కొత్త తేదీలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన కొత్త షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 27 నుంచి జనవరి 16 వరకు ఈ పరీక్షలను దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు.

ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి రాత పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను నవంబర్‌ 19 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్‌ కార్డులను కూడా వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,438 గ్రూప్‌ డి లెవల్ 1 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టింది.

గతంలో ప్రకటించిన పాత షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 17 నుంచి ఈ పరీక్షలు జరగాల్సి ఉండంగా.. పలు కారణాలతో అవి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఏవైనా సందేహాలుంటే హెల్ప్‌డెస్క్‌ నంబర్‌ 9513631887ను సంప్రదించవచ్చని రైల్వే బోర్డు తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.