RBI Assistant Result 2022: రిజర్వ్‌ బ్యాంక్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ ఫలితాలు విడుదల.. ఇలా తనిఖీ చేయండి..!

|

May 24, 2022 | 3:07 PM

RBI Assistant Result 2022: ఆర్బీఐ అసిస్టెంట్ పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పోస్టుల కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులు RBI అధికారిక వెబ్‌సైట్, rbi.org.in ని సందర్శించి ఫలితాలను

RBI Assistant Result 2022: రిజర్వ్‌ బ్యాంక్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ ఫలితాలు విడుదల.. ఇలా తనిఖీ చేయండి..!
Rbi Assistant Result 2022
Follow us on

RBI Assistant Result 2022: ఆర్బీఐ అసిస్టెంట్ పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పోస్టుల కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులు RBI అధికారిక వెబ్‌సైట్,ని సందర్శించి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ రిక్రూట్‌ మెంట్‌ ద్వారా ఆర్బీఐ మొత్తం 950 పోస్టులను భర్తీ చేయనుంది. ఫలితాలని తెలుసుకున్న తర్వాత అభ్యర్థులు తదుపరి ప్రక్రియ కోసం అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షను మార్చి 26, మార్చి 27న నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన ఈ పోస్టులకి ఫిబ్రవరి 17 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేసుకోవడానికి 8 మార్చి 2022 వరకు సమయం ఇచ్చారు. ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో పనిచేయాల్సి ఉంటుంది.

RBI అసిస్టెంట్ ఫలితాలు ఇలా తెలుసుకోండి..

1. ఫలితాలను తెలుసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్-కి వెళ్లండి.

ఇవి కూడా చదవండి

2. వెబ్‌సైట్ హోమ్ పేజీలోని ఖాళీల విభాగానికి వెళ్లండి.

3. ఇందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ పరీక్ష ఫలితాలు లింక్‌కి వెళ్లండి.

4. ఇందులో డౌన్‌లోడ్ ప్రీ మార్క్స్ లింక్‌కి వెళ్లండి.

5. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ని ఎంటర్‌ చేయడం ద్వారా లాగిన్ అవ్వండి.

6. లాగిన్ అయిన తర్వాత ఫలితాలు వెలువడుతాయి.

7. వెంటనే ప్రింట్ అవుట్ తీసుకోండి.

RBI అసిస్టెంట్ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకి హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మెరిట్ జాబితాలో చోటు దక్కించుకున్న వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇందులో కూడా ఉత్తీర్ణత సాధించిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత అపాయింట్‌మెంట్ లెటర్ అందిస్తారు. మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఇందులో 200 ప్రశ్నలు అడుగుతారు. దీని కోసం అభ్యర్థులకు 135 నిమిషాలు కేటాయిస్తారు. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయని గమనించండి. ప్రతి తప్పు సమాధానానికి నాలుగింట ఒక వంతు మార్కులు కట్‌ చేస్తారు.

మరిన్ని కెరియర్ వార్తల కోసం ఇక్కడ క్లి్క్ చేయండి