RRB Group-D Exam Date: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ గ్రూప్ డి పోస్టుల భర్తీకి 2019లోనే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గతేడాదే పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. కరోనా కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. తాజాగా ఆర్ఆర్‌బి ఎన్టీపీసీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రూప్ డి పరీక్షలను కూడా త్వరలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు. అధికారిక సమాచారం ప్రకారం.. ఏప్రిల్ చివరి వారం నుంచి జూన్ మధ్య గ్రూప్ డి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరీక్షలకు సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే విడుదల చేయనున్నారు. వేల సంఖ్యలో విడుదల చేసిన గ్రూప్ డి పోస్టులకు దేశ వ్యాప్తంగా ఒకటిన్నర కోట్లకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్‌బి ఎన్టీపీసీ పరీక్ష ముగింపు దశకు చేరుకుంది. దాంతో గ్రూప్-డి పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. వివిధ దశల్లో నిర్వహించనున్న ఈ పరీక్షకు సంబంధించి తేదీలను త్వరలో ప్రకటించనున్నారని విశ్వసనీయ సమాచారం.
ప్రతీ రైల్వే పరీక్షల మాదిరిగానే గ్రూప్-డి పరీక్షకు అడ్మిట్ కార్డును పరీక్షకు నాలుగు రోజుల ముందు జారీ చేస్తారు. అభ్యర్థులు ఆర్ఆర్‌బి వెబ్‌సైట్‌ను సందర్శించి తద్వారా అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు తమ దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డులో పరీక్ష సమయం, తేదీ, పరీక్ష జరిగే ప్లేస్ వివరాలు ఉంటాయి.
ఆర్‌ఆర్‌బి గ్రూప్-డి పరీక్షా విధానం:
– గ్రూప్-డి పరీక్ష కంప్యూటర్ బెస్‌డ్ టెస్ట్(సిబిటి) విధానంలో నిర్వహిస్తారు.
– ఈ పరీక్షలో 100 ప్రశ్నలు అడుగుతారు.
– పరీక్షలో నెగటివ్ మార్కుల విధానం ఉంటుంది.
– ప్రతి 3 తప్పు ప్రశ్నలకు 1 మార్క్ కట్ చేయడం జరుగుతుంది.
– పరీక్షా సమయం 90 నిమిషాలు ఉంటుంది.
Also read: