PM Modi tweet on medical college fee decision: మెడిసిన్ చదవడానికి స్వదేశం విడచి ఇతర దేశాలకు వెళ్తున్న పేద విద్యార్ధులకోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 50 శాతం సీట్లకు ప్రభుత్వ కాలేజీల మాదిరి ఫీజులు ఉంటాయని ప్రధాని మోదీ (PM Modi) మార్చి 7 (సోమవారం)న ట్విటర్ ద్వారా ప్రకటించారు. అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీల (govt medical seats)తో సమానంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా 50 శాతం ఫీజులు వసూలు చేస్తారన్నమాట. ప్రభుత్వ కళాశాలల్లో మెడికల్ సీట్ల కొరత, ప్రైవేట్ కాలేజీల్లో అధిక ఫీజుల మోత కారణంగానే విద్యార్థులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ పరిస్థితిమారాలంటే స్వదేశంలో చదువుకునే అవకాశాలు కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ నుంచి ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్ తరలింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో.. దేశంలోని ప్రభుత్వం, ప్రైవేట్ మెడికల్ కాలేజీ సీట్లలో 50% ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఫీజులకే అందించనున్నట్లు ఈ మేరకు ప్రధాని తెలియజేశారు. తాజా నిర్ణయం పేద, మధ్యతరగతి వర్గాలకు మేలు చేస్తుందని ప్రధాని తెలిపారు.
అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ప్రైవేట్ కాలేజ్, డీమ్డ్ యూనివర్సిటీల్లో 50 శాతం సీట్లను ప్రభుత్వ కాలేజీ ఫీజులకే అందిస్తామనే నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ మెమోరాండమ్ కూడా విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి దీనికి సంబంధించిన తుది ప్రకటన వెలువడనున్నట్లు బుధవారం తెల్పింది. అంతేకాకుండా ఈ నూతన మార్గదర్శకాలను ప్రతి రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఫీజు ఫిక్సేషన్ కమిటీ తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
कुछ दिन पहले ही सरकार ने एक और बड़ा फैसला लिया है जिसका बड़ा लाभ गरीब और मध्यम वर्ग के बच्चों को मिलेगा।
हमने तय किया है कि प्राइवेट मेडिकल कॉलेजों में आधी सीटों पर सरकारी मेडिकल कॉलेज के बराबर ही फीस लगेगी: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 7, 2022
Also Read: