President Murmu: విద్యా రంగంలో ఆ కీలక నియామకాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం

దేశ వ్యాప్తంగా ఉన్న 8 ఐఐటీలకు కొత్త డైరెక్టర్ల నియామకాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగీకారం తెలిపారు. వీరిలో ఇద్దరు రెండో సారి డైరెక్టర్లుగా నియామకమయ్యారు. విద్యా శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం..

President Murmu: విద్యా రంగంలో ఆ కీలక నియామకాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం
President Murmu

Updated on: Sep 20, 2022 | 12:12 PM

New Directors for for 8IIT’s: దేశ వ్యాప్తంగా ఉన్న 8 ఐఐటీలకు కొత్త డైరెక్టర్ల నియామకాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగీకారం తెలిపారు. వీరిలో ఇద్దరు రెండో సారి డైరెక్టర్లుగా నియామకమయ్యారు. విద్యా శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం.. పాలక్కాడ్, తిరుపతి, ధార్వాడ్, భిలాయ్, గాంధీనగర్, భువనేశ్వర్, గోవా, జమ్ములలోని ఐఐటీలకు డైరెక్టర్లను నియమించారు. ప్రస్తుతం ఐఐటీ మద్రాస్‌లోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ ఎ శేషాద్రి శేఖర్ ఐఐటి పాలక్కాడ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఐఐటి మద్రాస్‌ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణను ఐఐటి తిరుపతికి డైరెక్టర్‌గా నియమించారు. IIT (BHU) ప్రొఫెసర్ రాజీవ్ ప్రకాష్‌ను ఐఐటీ భిలాయ్ డైరెక్టర్‌గా నియమించారు. ఐఐటీ గాంధీనగర్‌కు ప్రొఫెసర్ రజత్ మూనా, ప్రొఫెసర్ పసుమర్తి శేషు (ఐఐటీ గోవా), ప్రొఫెసర్ వెంకప్పయ్య ఆర్ దేశాయ్ (ఐఐటీ ధార్వాడ్), ప్రొఫెసర్ శ్రీపాద్ కర్మల్కర్ (ఐఐటీ భువనేశ్వర్), ప్రొఫెసర్ మనోజ్ సింగ్ గౌర్ (ఐఐటీ జమ్మూ)కు డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.