
భారత ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ అయిన ప్రసార్ భారతి.. ఒప్పంద ప్రాతిపదికన ఏడాది కాలానికి కాపీ ఎడిటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 29 కాపీ ఎడిటర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో 21 పోస్టులు దూరదర్శన్, 8 పోస్టులు ఆకాశవాణిలో భర్తీ చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ప్రసార్ భారతిలో కాపీ ఎడిటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా గ్రాడ్యుయేషన్ లేదా జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఐదేళ్ల ఉద్యోగానుభవం కూడా ఉండాలి. హిందీ/ఇంగ్లిష్‌తో పాటు సంబంధిత ప్రాంతీయ భాష పరిజ్ఞానం అవసరం. అభ్యర్ధులకు వయోపరిమితి 35 ఏళ్లకు మించకూడదు. ఆసక్తి కలిగిన వారు ప్రకటన వెలువడిన 15 రోజుల్లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగ ప్రకటన నవంబర్ 11, 2025వ తేదీన విడుదలైంది.
ఈ పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఇమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. ఎంపికైన వారికి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రసార్ భారతి బ్రాంచుల్లో ఎక్కడైనా పని చేయవల్సి ఉంటుంది. నెలకు రూ.35 వేల వరకు జీతం చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ప్రసార్ భారతిలో కాపీ ఎడిటర్ పోస్టుల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.