PowerGrid Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. గేట్‌ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..

|

Feb 03, 2022 | 4:35 PM

PowerGrid Recruitment: పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (powergrid corporation of india)పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషనలో భాగంగా పలు విభాగాల్లో ఉన్న అసిస్టెంట్‌ ఇంజనీరింగ్ ట్రెయినీ...

PowerGrid Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. గేట్‌ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..
Power Grid Jobs
Follow us on

PowerGrid Recruitment: పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (powergrid corporation of india)పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషనలో భాగంగా పలు విభాగాల్లో ఉన్న అసిస్టెంట్‌ ఇంజనీరింగ్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషనలో భాగంగా మొత్తం 105 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో కంప్యూటర్‌ సైన్స్‌ (37), ఎలక్ట్రికల్‌ (60), సివిల్‌ (04), ఎలక్ట్రానిక్స్‌ (04) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో కంప్యూటర్‌ సైన్స్‌/ఎలక్ట్రికల్‌/సివిల్‌ /ఎలక్ట్రానిక్స్‌ సబ్జెక్టుల్లో ఫుల్‌ టైం బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. వీటితో పాటు వాలిడ్‌ గేట్‌ 2021 స్కోర్‌ పొంది ఉండాలి.

* అభ్యర్థుల వయసు 31-12-2021 నాటికి 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థ/లు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను గేట్‌ 202 మెరిట్ స్కోర్‌, బిహేవియర్‌ అసెస్‌మెంట్, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికై అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ. 40 వేలతో పాటు ఇతర అలవెన్సులు అందిస్తారు. ఏడాది శిక్షణ పూర్తయిన తర్వాత (ఇంజనీర్‌ ఈ 2 స్కేల్‌) నెలకి రూ.50,000 నుంచి రూ.1,60,000 + ఇతర అలవెన్సులు అందజేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 20-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Digvijay Comments: ప్రధాని మోడీపై ఎంపీ దిగ్విజయ్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు.. రాజ్యసభలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య దుమారం!

Payal Rajput: చిలిపి ఫోజులు ఆకట్టుకుంటున్న చిన్నది

Bandi Sanjay Arrest Issue: ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరైన తెలంగాణ పోలీసు అధికారులు.. బండి సంజయ్ అరెస్టుపై వివరణ..