NTA Announcement: జువాద్‌ తుఫా‌న్‌ ప్రభావంతో ఏపీ, ఒడిశా, బెంగాల్​లో పరీక్షలు వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే!

ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5న దేశవ్యాప్తంగా నిర్వహించవలిసిన యూజీసీ నెట్ పరీక్షను జాతీయ పరీక్షల విభాగం వాయిదా వేసింది.

NTA Announcement: జువాద్‌ తుఫా‌న్‌ ప్రభావంతో  ఏపీ, ఒడిశా, బెంగాల్​లో పరీక్షలు వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే!
Exams

Updated on: Dec 04, 2021 | 2:19 PM

NTA Exams post phoned: ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5న దేశవ్యాప్తంగా నిర్వహించవలిసిన యూజీసీ నెట్ పరీక్షను జాతీయ పరీక్షల విభాగం వాయిదా వేసింది. ఇండియన్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్​లో) ఎంబీఏ ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షను సైతం జాతీయ పరీక్షల విభాగం వాయిదా వేసింది. ఈ మేరకు NTA తన వెబ్‌సైట్‌లో రెండు వేర్వేరు నోటిఫికేషన్‌లను విడుదల చేసింది.

జవాద్‌ తుఫా‌న్‌ ప్రభావముండే ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్​లో ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. భువనేశ్వర్, గుణుపూర్, కటక్, బెర్హంపూర్ , పూరి, విశాఖపట్నం నగరాలకు UGC NET పరీక్ష రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. తదుపరి తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు వారు పేర్కొన్నారు. అలాగే, ఒడియా, తెలుగు, సోషల్ వర్క్, మరియు లేబర్ వెల్ఫేర్/పర్సనల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/ లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్/హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సబ్జెక్టులకు పరీక్షలు రీషెడ్యూల్ చేస్తున్నట్లు తెలిపింది.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) డిసెంబర్ 5 ఆదివారం జరగాల్సిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (IIFT) మరియు UGC NET ప్రవేశ పరీక్షను వాయిదా వేసింది. జవాద్ తుఫాను కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. రీషెడ్యూల్ చేసిన పరీక్షలకు సంబంధించి సవరించిన తేదీలను తర్వాత అప్‌లోడ్ చేస్తామని తెలిపింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మినహా ఇతర రాష్ట్రాలలోని అన్ని ఇతర నగరాల పరీక్ష షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని NTA స్పష్టం చేసింది.

IIFT ప్రవేశ పరీక్ష
విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, సంబల్‌పూర్, కటక్, కోల్‌కతా మరియు దుర్గాపూర్ నగరాలకు IIFT ప్రవేశ పరీక్ష రద్దు చేయడం జరిగింది. అయా నగరాల్లోని పరీక్షా కేంద్రాలలో ప్రవేశం పొందిన అభ్యర్థులకు పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తామని కమిషన్ తెలిపింది.

Read Also…  Rosaiah: రోశయ్య పార్థివదేహానికి సీఎం కేసీఆర్‌ నివాళి.. రేపు కొంపల్లి ఫాంహౌజ్‌లో అధికారికంగా అంత్యక్రయలు