Postal Jobs: న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థలో గ్రామీణ్ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టులను భర్తీ చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా 650 గ్రామీణ్ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 34, తెలంగాణలో 21 ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతో పాటు గ్రామీణ్ డాక్ సేవక్‌గా రెండేళ్లు అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 30-04-2022 నాటికి 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షను 120 మార్కులకు నిర్వహిస్తారు.
* అభ్యర్థులు రూ. 700 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 10-05-2022న మొదలువుతుండగా, 20-05-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్యా, ఉద్యోగాల వార్తల కోసం క్లిక్ చేయండి..