Job Mela: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. రూ.25వేల వేతనంతో ఉద్యోగ అవకాశాలు.. ఎక్కడంటే?

నిరుద్యోగ యువతకు ఇదో అదిరిపోయే గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే అపోలో ఫార్మసీ, ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో జనవరి 28, 2026న హైదరాబాద్‌లో జాబ్ మేళా నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టులకు నియామకాలు చేపట్టనుంది. కాబట్టి అర్హులైన విద్యార్థులు ఈ జాబ్‌ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

Job Mela: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. రూ.25వేల వేతనంతో ఉద్యోగ అవకాశాలు.. ఎక్కడంటే?
Osmania University Job Fair

Edited By:

Updated on: Jan 23, 2026 | 1:44 PM

హైదరాబాద్, జనవరి 23: ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ సంస్థ ఈ నెల 28న జాబ్ మేళాను నిర్వహించనుంది. ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ జాబ్ మేళా, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురు వైపున ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో జరుగుతుంది.

ఈ పోస్ట్‌లకు ఎవరు అర్హులు

ఈ జాబ్ మేళా ద్వారా అపోలో ఫార్మసీలో ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం 100 ఖాళీలను భర్తీ చేసే లక్ష్యంతో ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం. ఫార్మసీ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న యువతీ,  యువకులకు మాత్రమే అర్హత ఉంటుంది.

వేతనం, ఇతర వివరాలు

ఈ ఉద్యోగాలకు నెలకు రూ.12,000 నుంచి రూ.25,000 వరకు వేతనం ఇవ్వనున్నారు. మరిన్ని వివరాల కోసం అపోలో ఫార్మసీ హెచ్‌ఆర్ విభాగానికి చెందిన టీ. రఘుపతిని (ఫోన్ నంబర్: 8247656356) సంప్రదించవచ్చని ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో జనవరి 28, 2026న నేరుగా ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు.

మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.