AP OAMDC 2021-22: విద్యార్థులకు గమనిక.. ఇవాళ్టి నుంచి ఏపీ డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్లు..

|

Sep 17, 2021 | 10:10 AM

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని యాజమాన్యాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి (సెప్టెంబర్‌ 17) మొదలువుతుంది.

AP OAMDC 2021-22: విద్యార్థులకు గమనిక.. ఇవాళ్టి నుంచి ఏపీ డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్లు..
Ap Degree Online Admissions
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని యాజమాన్యాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి (సెప్టెంబర్‌ 17) మొదలువుతుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీతో పాటు బీటెక్, బీఎస్సీ, బీఫార్మసీ తదితర ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కోర్సులు నిర్వహించే అన్ని కాలేజీలు, యునివర్సిటీలను అక్టోబర్ 1వ తేదీ నుంచి పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర తాజాగా 2021–22 అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేశారు.

 

పూర్తి షెడ్యూల్‌ ఇలా..

నోటిఫికేషన్‌ విడుదల: సెప్టెంబర్‌ 16
విద్యార్థుల రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం: సెప్టెంబర్‌ 17–22 వరకు
వెబ్‌ ఆప్షన్ల నమోదు: సెప్టెంబర్‌ 23–26 వరకు
వెరిఫికేషన్‌: సెప్టెంబర్‌ 23, 24 (స్పెషల్‌ కేటగిరి)
సీట్ల కేటాయింపు: సెప్టెంబర్‌ 29
కాలేజీల్లో రిపోర్టింగ్‌: సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 1
తరగతుల ప్రారంభం: అక్టోబర్‌ 1 నుంచి

కోవిడ్ దృష్ట్యా సరి, బేసి విధానంలో తరగతులను నిర్వహించాలని.. స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌వోపీ) ప్రకారం తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వారానికి 6 రోజులు తరగతులను నిర్వహించనున్నారు. ఏదైనా కారణం చేత ఒక రోజు క్లాస్ జరగకపోతే.. రెండో శనివారం/ఆదివారం/సెలవు రోజులో నిర్వహిస్తారు. అలాగే అన్ని కోర్సులకు 2022-23 విద్యా సంవత్సరం ఆగష్టు 9 నుంచి పునః ప్రారంభం కానుంది. మూడో సెమిస్టర్ ఆగష్టు 9 నుంచి ప్రారంభం కానుంది. అలాగే 3 నుంచి 8వ సెమిస్టర్ వరకు కూడా సరి, బేసి విధానంలోనే వేర్వేరు షెడ్యూల్స్‌ను రూపొందించారు.

ఇవి కూడా చదవండి: IIT Admission 2021: ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులు కూడా IIT లో అడ్మిషన్ తీసుకోవచ్చు.. పూర్తి వివరాలు ఇవిగో..

PM Modi: సంచలనాత్మక నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ ప్రధాని నరేంద్ర మోడీ..! గొప్ప నాయకుడిగా ఎలా మారారో తెలుసా?