భారత ప్రభుత్వ పెట్రలోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోనున్న ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఇంజనీరింగ్, జియో సైన్సెస్ విభాగాలో 871 ఏఈఈ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయోపరిమితి జులై 31, 2022వ తేదీ నాటికి పోస్టులను బట్టి 28, 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ, బీఈ, బీటెక్, డిప్లొమా, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే గేట్-2022లో వ్యాలిడ్ స్కోర్ కూడా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా అక్టోబర్ 12వ తేదీ ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరల్ అభ్యర్ధులు రూ.300లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. విద్యార్హతలు, గేట్ స్కోర్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.60,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.